నువ్వు ఉంటే ఏమీ చస్తే ఏమి..!! జూనియర్ ఎన్టీఆర్పై ముసలవ్వ తిట్ల పురాణం....!!!

murali krishna
యంగ్ ఎన్టీఆర్‌ పై ఓ ముసలవ్వ బూతులతో రెచ్చిపోయింది.నడి రోడ్డుపై ఎన్టీఆర్‌ని తిడుతూ సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
రీసెంట్ గా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయమై జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన రియాక్షన్ నందమూరి అభిమానులకు కాస్త వెగటుగా అనిపించింది. దీంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పై ట్రోలింగ్ కూడా నడిచింది.
ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై తారక్ స్పందించిన తీరును ఓ ముసలవ్వ తప్పుబట్టింది. ఏపీలో అమరావతి రాజధాని సాధన కోసం రైతులు మహా పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో ఓ బామ్మ రెచ్చిపోయింది. ఓ రిపోర్టర్ పలకరించగా.. ఆ బామ్మ జూనియర్ ఎన్టీఆర్‌ పై ఫైర్ అయింది.
ఎన్టీఆర్ మనవడినని చెప్పుకుంటున్నాడు. ఎందుకు ఎన్టీఆర్ మనవడు. ఏమీ వద్దు మహానుభావా..! నువ్వు ఎన్టీఆర్ మనవడివి అయితే రా ముందుకు రా..! నీ తాతను అవమానించినప్పుడు ఇంకా నువ్వెందుకురా.. అంటూ రెచ్చిపోయింది ఆ బామ్మ.నువ్వు ఉంటే ఏమీ చస్తే ఏమి.. మా తెలుగు దేశాన్ని (TDP) మేమే లాక్కొచ్చుకుంటాం.. అంటూ ముసలావిడ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.దీంతో ఈ విషయమై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎలా స్పందిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ ముసలవ్వ మాటలను సమర్దిస్తారా? లేక విమర్శిస్తారా అనేది ఇప్పుడు జనాల్లో అసలైన చర్చ అయింది. చూడాలి మరి ఈ ఇష్యూ ఎక్కడిదాకా వెళుతుందనేది.RRR తర్వాత ఎన్టీఆర్ సినిమా కోసం నందమూరి అభిమాన లోకం ఎంతగానో ఎదురు చూస్తోంది. ఆయన తదుపరి సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని అతృతతో ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్.
ఈ సినిమాలో ఆలియా భట్ హీరోయిన్‌గా నటించాల్సింది ఉంది. కానీ ప్రెగ్నంట్ కావటం వంటి కారణాలతో ntr 30 నుంచి ఆమె తప్పుకుందని.. దీంతో మరో హీరోయిన్ ప్రారంభించిన కొరటాల రష్మికకు ఓటేశారని టాక్. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ షురూ కానుంది.యువ సుధా ఆర్ట్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై నందమూరి కళ్యాణ్ రామ్‌, సుధాకర్ మిక్కిలినేని నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను గ్రాండ్ గా రూపొందించాలని సన్నాహాలు చేస్తున్నారట

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: