రెమ్యునరేషల్ విషయం పై బూతులు తిట్టిన సల్మాన్ ఖాన్..

Satvika
తెలుగు సినిమాలు ఇప్పుడు వరుస హిట్ ను అందుకుంటున్నాయి..అంతేకాదు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కూడా అందుకుంటున్నాయి.అయితే.. బాలివుడ్ లో ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా పడలేదు..బాలివుడ్ బడా హీరోలు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. మంచి టాక్ ను అందుకుంటున్నారు.ఇక విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "ఆచార్య" సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యపాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుండే థియేటర్ల వద్ద నెగిటివ్ రెస్పాన్స్ అందుకుంది. తాజాగా చిరంజీవి తన ఆశలన్నీ తన తదుపరి సినిమా "గాడ్ ఫాదర్" పైనే పెట్టుకున్నారు. మోహన్ రాజా దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" సినిమాకి తెలుగు రీమేక్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. నయనతార, సత్యదేవ్, మురళి శర్మ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో కనిపించారు.అయితే సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత చిరంజీవి కొంత అమౌంట్ ను చెక్ మీద రాసి అది మేనేజర్ కి ఇచ్చి సల్మాన్ ఖాన్ కి ఇవ్వమని అడిగారట. ఇక సల్మాన్ ఖాన్ కు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి మేనేజర్ లోపలికి వెళ్తే సల్మాన్ ఖాన్ బూతులు తిట్టారట. అవన్నీ చెబితే చానెళ్లు బీప్ బీప్ లు వేసుకోవాలట. అయితే సల్మాన్ ఖాన్ మేగేజర్ ను తిట్టి తాను సినిమా చేసింది మెగాస్టార్ మీద ఉన్న గౌరవంతో అని, దానికి ఎవరైనా రెమ్యూనిరేషన్ ఇస్తారా అని తిరిగి ప్రశ్నించి మేనేజర్ ను వెనక్కి పంపేశారట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: