పెళ్లి కి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్ లు..అదిరిపోయే ట్విస్ట్.!!

murali krishna
పెళ్లి కి ముందే ప్రెగ్నెంట్ అవుతోన్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అయితే ఇది ఇప్పటి నుంచే కాదు.. గత కొన్ని దశాబ్దాల నుంచే నడుస్తోంది. రీసెంట్‌గా బాలీవుడ్ నటి నేహా దూపియా పెళ్లి కన్నా ముందే ప్రెగ్నెంట్ అయ్యి అందరిని ఆశ్చర్యపరిచింది.
అంటే పెళ్లి కంటే ముందే ఆమె తనకు కాబోయే భర్తతో శారీరకంగా కలవడంతో ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. అయితే ఆమె కంటే ముందే పిల్లల తల్లులుగా ఉన్న హీరోయిన్లు కూడా పెళ్లి పీటలు ఎక్కేశారు. ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.
కమల్ హాసన్ - సారిక :
విశ్వనటుడు కమల్‌హాసన్‌కు ఇప్పటికే గౌతమిని కూడా కలుపుకుంటే ముగ్గురు భార్యలు ఉన్నట్టే లెక్క. గౌతమిని కమల్ పెళ్లి చేసుకోకపోయినా ఆమెతో పదేళ్లకు పైగానే సహజీవనం చేశారు. అంతకు ముందే ఆయనకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. అప్పటి బాలీవుడ్ నటి సారికతో కమల్ సహజీవనం చేశాడు. పెళ్లి కాకుండానే శృతి సారిక కడుపులో పడింది. ఆమె ప్రెగ్నెంట్‌గా ఉండగా కమల్‌ను పెళ్లాడింది.
పవన్ - రేణు దేశాయ్ :
పవన్ - రేణు దేశాయ్ బంధం కూడా అంతే. ఈ దంపతులకు అకీరా నందన్‌, ఆద్య అనే ఇద్దరు పిల్లలు పుట్టాక పెళ్లి జరిగింది. అది కూడా పవన్ రాజకీయాల్లోకి రావడంతో విమర్శలు వచ్చాక హిందూ సంప్రదాయం ప్రకారం రేణు మెడలో మూడు ముళ్లు వేశాడు.
రణబీర్ కపూర్ - అలియా భట్ :
రీసెంట్‌గా బాలీవుడ్ కపుల్స్ రణబీర్ కపూర్‌, అలియాభట్ పెళ్లి చేసుకున్న వెంటనే పేరెంట్స్ అవుతున్నట్టు చెప్పి షాక్ ఇచ్చారు. అంటే పెళ్లికి ముందే అలియా ప్రెగ్నెంట్ అని తేలింది.
నయనతార- విఘ్నేష్ శివన్‌:
వీరు కూడా పెళ్లి అయిన నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులు అయ్యారు. నయనతార ఎక్కడా కూడా కడుపుతో కనపడలేదు. పెళ్లయ్యాక కూడా ఆమె షూటింగులతో బిజీగా ఉంది. కేవలం వీరు సరోగసితో తల్లిదండ్రులు అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: