ఆందోళన లో ఆది పురుష్ సినిమా డైరెక్టర్..!!

murali krishna
కొద్ది రోజులుగా ట్రెండ్ లో ప్రభాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఆది పురుష్ ఉంటూ వస్తోంది. వచ్చే సంక్రాంతికి  ఈ సినిమా థియేటర్లలో అడుగు పెట్టాల్సి ఉంది, అయితే ఈ చిత్రం  మొదట లోనే నెగిటివిటీని ఎదుర్కొంటోంది.
టీజర్ లో వాడిన గ్రాఫిక్స్ మీద విపరీతమైన నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. విఎఫ్ ఎక్స్ దారుణంగా ఉందని, రావణాసురుడు అసలు బాగోలేని ఇలా తలో మాటా అన్నారు. దాంతో అలెర్ట్ అయిన టీమ్ హైదరాబాద్ ఏఎంబి మాల్ లో ప్రత్యేకంగా త్రీడి వెర్షన్ ని మీడియాకు ప్రదర్శించారు. మీడియా బాగానే పొగిడింది. అతిధిగా వచ్చిన దిల్ రాజుతో పాటు యూనిట్ సభ్యులందరూ కంటెంట్ మీద గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
అక్కడితో ఆది పురుష్ మీద ఉన్న సందేహాలకు చెక్ పడ్డాయో లేవో కానీ...మరోవైపు  ఎన్నో వివాదాలు  వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హనుమంతుడు, రావణుడి గెటప్స్ కి సంబంధించి పలువురు అభ్యంతరం వ్యక్తం  కూడా చేస్తున్నారు. రాముడి కథను విజువల్ ఎఫెక్ట్స్ పేరుతో విచిత్రంగా చూపిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ పేరుతో యానిమేషన్ జొప్పించారని, అవి కూడా సహజంగా లేవని, కార్టూన్ నెట్వర్క్ స్థాయిలో సినిమాను తీసి అయిదు వందల కోట్ల బడ్జెట్ పేరుతో మోసం చేస్తారని నెటిజెన్లు గట్టిగానే తగులుకుంటున్నారు. నేపధ్య సంగీతం, థీమ్, కంటెంట్ గురించి కన్నా ఎక్కువగా విఎఫ్ఎక్స్ గురించే చర్చ జరుగుతోంది.
కొందరు ఏకంగా కోర్టుకు కూడా వెళ్ళారు. ఢిల్లీకి చెందిన రాజా గౌరవ్ అనే న్యాయవాది తీస్‌ హజారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆదిపురుష్‌ టీజర్ లో రాముని, ఆంజనేయుని అసంబద్ధంగా చూపించాలని ఆయన ఆరోపించారు. యూట్యూబ్ నుండి ఆ టీజర్ వీడియోను వెంటనే తొలగించాలని, అలాగే సినిమా విడుదలపై స్టే విధించాలని కోర్టును ఆయన కోరడం జరిగింది.
ఆదిపురుష్ టీజర్ లో రాముడ్ని, ఆంజనేయుడ్ని అసంబద్ధంగా చూపించారని ఆరోపించారు. వారు తోలు పట్టీలతో కూడిన దుస్తుల్లో ఉన్నట్టుగా టీజర్ లో కనిపిస్తోందని వివరించారు. ఇక, రావణుడ్ని చాలా చవకబారుగా చూపించారని పేర్కొన్నారు. మోడ్రన్ హెయిర్ స్టయిల్, చెవులపై బ్లేడ్ సింబల్స్ తో రావణుడ్ని చిత్రీకరించారని పిటిషనర్  కు వివరించారు. మొఘల్ చక్రవర్తుల పూర్వీకుడిలా కనిపిస్తున్న రావణుడు గబ్బిలంపై స్వారీ చేస్తున్న దృశ్యాలు కూడా టీజర్ లో ఉన్నాయని  ఆయన తెలిపారు.
శివభక్తుడైన రావణుడికి మీసాలు ఉంటాయని, మరియు తలపై నిత్యం బంగారు కిరీటం ఉంటుందని వివరించారు. రావణుడి వాహనం పుష్పక విమానం అని వెల్లడించారు. ఆదిపురుష్ టీజర్ హిందువుల మత విశ్వాసాలను, సంస్కృతి, చరిత్ర, నాగరికతలను దెబ్బతీసే విధంగా ఉందని ఆరోపించారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించబడితే ఆదిపురుష్‌ సినిమా కష్టాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: