నటి శివాత్మిక రాజశేఖర్ సినిమా రిలీజ్ కు సిద్దం..!!

murali krishna
'దొరసాని' చిత్రంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సీనియర్ నటుడు రాజశేఖర్  గారి కూతురు, యంగ్ బ్యూటీ శివాత్మిక  టాలీవుడ్ స్టార్ కాస్ట్ తోపాటు శివాత్మిక ప్రధాన పాత్రలో నటించి చిత్రం 'పంచతంత్రం సినిమా
ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు మరి, సినిమాలో కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, 'మత్తు వదలరా' ఫేమ్‌ నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద ప్రధాన తారాగణంగా నటించడం విశేషం.చిత్రం 'పంచతంత్రం'. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 'పంచతంత్రం' మూవీని డిసెంబర్ 9న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ మెంట్ వీడియోను  కూడా విడుదల చేసింది. వీడియో సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. ఈ వీడియోలో బ్రహ్మానందం కాస్త సీరియస్ గా, వ్యామోహంతో 'పంచతంత్రం' అనే పదం రాసి ఉన్న క్యాసెట్ ని చూస్తూ మొదలవుతుంది అంటా, తర్వాత రాహుల్ విజయ్ కాస్త ఆత్రుతగా గాలిలోకి చూస్తూ నడవడం, హ్యాపీ మూడ్‌లో ఉన్న శివాత్మిక రాజశేఖర్‌ని అతనికి జోడీగా చూపించడం ఆకట్టుకుంటోంది. సముద్రఖని మరియు దివ్య వాణి మధ్య వయస్కులైన జంటగా నటిస్తున్నారు. దివ్య శ్రీపాద, 'కలర్స్' స్వాతి కీలక పాత్రలో కనిపించడం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, 'అరెరే అరెరే' అనే పాట కూడా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. రీసెంట్ గా 'యే రాగమో' అనే మరో పాటను కూడా విడుదల చేశారు. ఈ పాటలకు ప్రేక్షకులనుండి  మంచి ఆదరణ లభిస్తోంది. సినిమాలో పాత్రలు చాలా అందంగా డిజైన్ చేశామని దర్శకుడు హర్ష తెలిపారు. వేదవ్యాస్ పాత్రలో బ్రహ్మానందం జీవించారని తెలిపారు. మిగిలిన పాత్రల్లోనూ నటీనటులు వారి బెస్ట్ అందించారన్నారు. సినిమా కథ చాలా ఆసక్తికరంగా సాగుతుందని  దర్శకుడు చెప్పారు. సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి మంచి సంగీత అందించినట్టు తెలిపారు. డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుందని పేర్కొన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: