ఒకవైపు విలన్లుగా, మరోవైపు కమెడియన్లుగా మెప్పించిన సినీ సెలబ్రిటీలు వీళ్లే...!!

murali krishna
టాలీవుడ్   ఇండస్ట్రీలో ఎంతో మంది టాలెం టెడ్  నటీ నటులు ఉన్నారు. కొంతమంది నటులు ఎలాంటి పాత్ర ఇచ్చినా అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్నారు.మరి  కొందరు  నటులు ఒకే తరహా  పాత్రలకు పరిమితమైనా ఆ పాత్రలలో తాము తప్ప మరెవరూ గొప్పగా నటించ లేరనేంత అద్భుతంగా నటిస్తూ  ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. టాలీవుడ్ కు చెందిన కొందరు నటీనటులు అటు విలన్లుగా ఇటు కమెడి యన్లుగా మెప్పించి ప్రేక్షకుల ప్రశంసలను  అందుకున్నారు.
టాలీవుడ్  ప్రముఖ నటుడు కోట  శ్రీనివాసరావు  గురించి  ప్రత్యేకం గా పరిచయం  చేయాల్సిన  అవసరం లేదు. తెలుగులోని చాలా సినిమాలలో కోట శ్రీనివాసరావు  కామెడీ చేస్తూనే  నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. తెలుగులో  విలన్ రోల్స్ లో  మెప్పించిన  నటులలో  రావుగోపాలరావు ఒకరు. కొన్ని  సినిమాలలో   రావుగోపాలరావు కామెడీ రోల్స్ లో సైతం నటించి మెప్పించడం  గమనార్హం. అటు  కామెడీ రోల్స్ లో, ఇటు  విలన్ గా మెప్పించిన నటులలో  పరేశ్ రావెల్  ఒకరు.శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి మామ పాత్రలో ఆయన నటనను సులువుగా మరిచి పోలేము. మరో  ప్రముఖ నటుడు  జయప్రకాష్ రెడ్డి  గురించి  ప్రత్యేకం గా చెప్పాల్సిన  అవసరం లేదు. ఫ్యాక్షనిస్ట్  పాత్రలలో  నటించినా, కామెడీ రోల్స్ లో నటించినా జయ ప్రకాష్ రెడ్డికి మరెవరూ  సాటిరారు. రఘుబాబు, రాహుల్ దేవ్ మరి కొందరు నటులు సైతం అటు  విలన్లుగా  ఇటు  కమెడియన్లుగా  పని చేసి ప్రేక్షకుల మెప్పు పొందారు.
టాలెంట్ ఉన్న టాలీవుడ్  విలన్   కమ్  కమెడియన్లు ఇతర భాషల్లో కూడా నటించి  ప్రేక్షకుల  మెప్పు పొందడం గమనార్హం. ఈ నటులకు విలన్లు గా, కమెడియన్లు గా మంచి  పేరు రావడంలో ఎంతోమంది దర్శకుల పాత్ర ఉందని చెప్పవచ్చు. రాబోయే  రోజుల్లో ఈ జాబితాలో  చేరే  నటులు ఎవరో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: