"స్వాతిముత్యం" మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోగా తన కంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని కలిగి ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ తాజాగా స్వాతిముత్యం మూవీ తో హీరో గా వెండి తెరకు పరిచయం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బెల్లంకొండ గణేష్ సరసన వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా నటించగా ,  లక్ష్మణ్ కే కృష్ణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. మహతి స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించగా , రావు రమేశ్, నరేశ్ వీకే, గోపరాజు రమణ, 'వెన్నెల' కిశోర్, ప్రగతి, సురేఖా వాణీ, సుబ్బరాజు, దివ్య శ్రీపాద, శ్రీమన్నారాయణ త‌దిత‌రులు ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ మంచి అంచనాల నడుమ అక్టోబర్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో ప్రస్తుతం స్వాతి ముత్యం మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఎంత గానో అలరించిన స్వాతిముత్యం మూవీ "ఓ టి టి" హక్కులకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళ్తే ... స్వాతిముత్యం మూవీ డిజిటల్ హక్కులను ఆహా "ఓ టి టి" సంస్థ దక్కించుకున్నట్లు , కొన్ని వారాల థియేటర్ రన్ తర్వాత ఈ మూవీ ని ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: