పెళ్లి పీటలు ఎక్కబోతున్న స్టార్ డైరెక్టర్ కూతురు..!!

Divya
తెలుగు సినీ దర్శకుడు డైరెక్టర్ గుణశేఖర్ ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. గుణశేఖర్ కూతురు నీలిమ గుణ ఎంగేజ్మెంట్ తాజాగా చాలా గ్రాండ్గా జరిగింది. తన తండ్రి తెరకెక్కించి ఎన్నో చిత్రాలకు ఈమె నిర్మాతగా కూడా వ్యవహరించింది. అలా రుద్రమదేవి సినిమాతో పాటు సమంత నటించిన శాకుంతలం సినిమా కు నిర్మాతగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వివాహ బంధంలో ఎంటర్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రవి అనే వ్యక్తితో ఆమె తాజాగా నిశ్చితార్థం జరిగినట్లుగా తెలుస్తున్నది. అయితే గుణశేఖర్ కి కాబోయే అల్లుడు పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. కేవలం ఎంగేజ్మెంట్ ఫోటోలు మాత్రమే ట్విట్టర్లో షేర్ చేసింది నీలిమ గుణ.

ఈ సందర్భంగా నెటిజెన్లు ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. అలాగే గుణశేఖర్ కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది.ఈ రోజు తమకు చాలా ప్రత్యేకమైన దినమని తన కూతురికి కూడా ఈరోజు చాలా ప్రత్యేకమైన దినమని తెలియజేస్తూ కూతురికి శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది. నీలిమ గుణ మొదట్లో పెద్దగా ఇండస్ట్రీలో కనిపించలేదు కానీ గుణశేఖర్ స్వయంగా తన బ్యానర్ పైన పలు సినిమాలను నిర్మించడంతో వాటి యొక్క పనులను ఏమి బాగా చూసుకునేది. ఆ తరువాత ఆ బాధ్యతలను తన పెద్ద కూతురు నీలిమ గుణ చేతిలో పెట్టడం జరిగింది.
ఇక అప్పటినుంచి ఎక్కువగా నిర్మాత వ్యవహారాలను ఆమె చూసుకొనేది. ముఖ్యంగా సినిమా కాస్టింగ్, రెమ్యూనరేషన్ ,ప్రొడక్షన్ డిజైనర్ ఇలా ఎన్నో విషయాలలో ఆమె దగ్గరుండి చూసుకుంటుందట. శాకుంతలం సినిమాకి సంబంధించి ఈమె చాలా యాక్టివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించి విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుందట. ఈ సినిమాని ఏడాది ఎలాగైనా విడుదల చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందుకు తగ్గట్టుగానే నవంబర్ 4వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన ఈ సినిమా మరింత ఆలస్యం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: