ది ఘోస్ట్ కలెక్షన్స్ తెలిస్తే షాక్

murali krishna
 అక్కినేని నాగార్జున హీరో గా నటించిన 'ది ఘోస్ట్' చిత్రం ఈ దసరా కానుకగా విడుదలై  చెడు టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..విడుదలకి ముందు ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ చూసి నాగార్జున గారు పెద్ద బ్లాక్ బస్టర్  కొట్టబోతున్నాడు అని అందరు అనుకున్నారు..టీజర్ మరియు ట్రైలర్ లో చూపిన విధంగానే ఈ చిత్రం లో మైండ్ బ్లాక్ అయ్యే యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి, కానీ కథ చాలా రొటీన్ గా ఉంది అందువల్లే జనాలకు సరిగా కనెక్ట్ కాలేకపోయింది..దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది..ఆడియన్స్ కి మొట్టమొదటి ఆప్షన్ అదే కావడం తో నాగార్జున ఘోస్ట్ చిత్రం పై తీవ్రమైన ప్రభావం పడింది..దసరా రోజు విడుదలైన కూడా ఈ సినిమాకి మొదటి రోజు వచ్చింది చిల్లరే.

మొదటి రోజు ఈ సినిమాకి నెల్లూరు వంటి ప్రాంతాల నుండి షేర్స్ రావడమే కరువు అయిపోయింది..నెల్లూరు లో కేవలం 5 లక్షల రూపాయిల షేర్ తో మొదటి రోజు ని ప్రారంభించింది అంటే అక్కినేని ఫామిలీ కి ఇది చాలా అవమానకరం..ఇక రెండవ రోజు కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది..ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాలలో నిన్న గాడ్ ఫాదర్ సినిమాకి టికెట్స్ దొరకని వాళ్ళు ఘోస్ట్ కి వెళ్లారు..ఆలా కొన్ని ప్రాంతాల వరుకు ఈ సినిమా రెండవ రోజు నెట్టుకొచ్చిన చాలా ప్రాంతాలలో కనీసం స్థాయి గ్రాస్ వసూళ్లను కూడా సాధించలేకపోయింది.
 

మొత్తం మీద ఈ సినిమాకి రెండవ రోజు 65 నుండి 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి..మొత్తం మీద రెండు రోజులకు కలిపి 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా ఈ సినిమా ఇంకా రాబట్టలేకపోయింది..ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 22 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చెయ్యాలి..అది అసాధ్యం అని  మనకి ఇప్పటికే అర్థం అయిపోయింది..డిస్ట్రిబ్యూటర్స్ కి ఈ సినిమా కనీసం 16 కోట్ల రూపాయిలు నష్టాల్ని మిగిలించేలా ఉందని మనం ఊహించ వచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: