గాడ్ ఫాదర్ మూవీ టైటిల్స్ లో ఏపీ ఎస్పీ పేరు....!!

murali krishna
మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లను సాధిస్తోంది. మూడో రోజు ఈ సినిమా కలెక్షన్లు కొంతమేర తగ్గినా ఈ సినిమా మూడు రోజుల్లో 90 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఈరోజు, రేపు ఈ సినిమా భారీ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తెలుగులో ఈ సినిమా బాగానే కలెక్షన్లను సాధిస్తున్నా హిందీలో మాత్రం ఈ సినిమాకు బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.
అయితే గాడ్ ఫాదర్ మూవీ టైటిల్స్ లో అనంతపురం ఎస్పీ పేరు కనిపించడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదనే సంగతి తెలిసిందే. అనంతపురంలో గాడ్ ఫాదర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ కు అనుమతులు ఇవ్వడంతో పాటు గాడ్ ఫాదర్ ఈవెంట్ కు భద్రత కల్పించి అతిథులకు, అభిమానులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండాచేయడంతో చిరంజీవి టైటిల్స్ లో ఫక్కీరప్పకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మధ్య కాలంలో గోరంట్ల మాధవ్ వివాదం ద్వారా ఫక్కీరప్ప పేరు ఎక్కువగా వార్తల్లో వినిపించింది. మరోవైపు గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ సాధించడంతో చిరంజీవి ఎంతగానో సంతోషిస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాల్సి ఉంది. గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన నటీనటులందరికీ మంచి పేరును తెచ్చిపెట్టింది.
చేయడంతో చిరంజీవి టైటిల్స్ లో ఫక్కీరప్పకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మధ్య కాలంలో గోరంట్ల మాధవ్ వివాదం ద్వారా ఫక్కీరప్ప పేరు ఎక్కువగా వార్తల్లో వినిపించింది. మరోవైపు గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ సాధించడంతో చిరంజీవి ఎంతగానో సంతోషిస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాల్సి ఉంది. గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన నటీనటులందరికీ మంచి పేరును తెచ్చిపెట్టింది.
ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు చిరంజీవి కోరుకున్న రేంజ్ లో సక్సెస్ సాధించింది. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే లూసిఫర్ సినిమాను చూసిన ప్రేక్షకులకు సైతం ఎంతగానో నచ్చింది. గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో వేగం పెంచితే ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్లతోనే మెజారిటి ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: