"తని ఒరివన్" మూవీని మొదట ఆ తెలుగు స్టార్ హీరోతో అనుకున్నరాట..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస మూవీ లలో నటిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. మిర్చి మూవీ వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగిన ప్రభాస్ బాహుబలి మూవీ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని పెంచుకొని ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ లలో , అంతకు మించిన మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలను మిస్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు ప్రభాస్ కథ నచ్చక మిస్ చేసుకుంటే ,  కొన్ని సినిమాలు ఇతర మూవీ లతో బిజీగా ఉండడం వల్ల మిస్ చేసుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ఒక భారీ బ్లాక్ బస్టర్ మూవీ ని కూడా ప్రభాస్ ఇతర మూవీ లతో బిజీగా ఉండడం వల్ల మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. జయం రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా తని ఒరివన్ ఏ రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. తమిళం లో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను ధ్రువ పేరుతో తెలుగు లో రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి తలకెక్కించాడు. ఈ మూవీ తెలుగు లో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇలా తమిళ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న తని ఒరివన్ సినిమా కథను మొదటగా మోహన్ రాజా ప్రభాస్ కోసమే రాసుకున్నాడట ,  అలాగే ప్రభాస్ కి తని ఒరివన్ కథను మోహన్ రాజా వివరించగా ఆ సమయంలో ప్రభాస్ ఇతర మూవీ లతో ఫుల్ బిజీగా ఉండడం వల్ల తని ఒరివన్ మూవీ లో ప్రభాస్ నటించ లేక పోయినట్లు తెలుస్తోంది. ఇలా ఇతర మూవీ లతో బిజీగా ఉండడం వల్ల ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ ని మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: