ఆ తేదీన ఫ్రీ రిలీజ్ కాబోతున్న "రెబల్" మూవీ..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిర్చి మూవీ వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగిన ప్రభాస్ "మిర్చి" మూవీ తర్వాత బాహుబలి సిరీస్ మూవీ లతో దేశ వ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా మూవీ లలో అంతకు మించిన మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ కొన్ని సంవత్సరాల క్రితం రెబల్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రభాస్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా ,  మరియు దీక్ష సెత్ హీరోయిన్ లుగా నటించారు.
 

ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు దర్శకుడు అయినటు వంటి రాఘవ లారెన్స్ రెబల్ మూవీ కి దర్శకత్వం వహించగా , కృష్ణంరాజు ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన రెబల్ మూవీ అప్పుడు ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయింది. కాకపోతే ఈ మూవీ లో ప్రభాస్ స్టైల్ కి , ఈ సినిమా లోని సాంగ్స్ కి , అలాగే రెబల్ మూవీ లోని యాక్షన్ సన్నివేశాలకు మాత్రం ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇప్పటికీ కూడా ఈ మూవీ లోని యాక్షన్ సన్నివేశాలకు ఎంతో మంది ప్రేమికులు ఉన్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం మనకు తెలిసింది. అందులో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తమన్నా , దీక్ష సేత్ హీరోయిన్ లుగా తెరకెక్కిన రెబల్ మూవీ ని కూడా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ ని అక్టోబర్ 15 వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: