ఆదిపురుష్ కు కలిసివస్తున్న వివాదాలు !

Seetha Sailaja
లేటెస్ట్ గా విడుదలైన ‘ఆదిపురుష్’ టీజర్ చుట్టూ అలుముకుంటున్న వివాదాలను చూసి ప్రభాస్ అభిమానులు దిగాలు పడిపోతున్నారు. ఇప్పటికే రెండు సినిమాల వరస ఫ్లాప్ ల మధ్య సతమతమైపోతున్న ప్రభాస్ కు ‘ఆదిపురుష్’ మూవీ కూడ పరాజయాన్ని కలిగిస్తే అతడి కెరియర్ పై అది తీవ్ర ప్రభావాన్ని చూపించే ఆస్కారం ఉందని ప్రభాస్ అభిమానులు అంతర్మధనానికి గురి అవుతున్నారు.

ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే ‘ఆదిపురుష్’ ను కుదిపేస్తున్న వివాదాలు ఒకవిధంగా ఆసినిమాకు కోట్లాది రూపాయల ఖర్చుతో కూడ రాణి ఫ్రీ పబ్లిసిటీ ఆమూవీకి వచ్చే విధంగా చేసిందని కొంతమంది బాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రావణుడి గెటప్ మీద బిజెపి నాయకుడు ఒకరు కోర్టు కేసుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

దీనికితోడు రాముడిని సాంప్రదాయ వేషధారణకు భిన్నంగా గెటప్ డిజైన్ చేయడం రాముడి మీసాల నుండి బాణాలు వరకు ఇలా ఎన్నో అంశాల పై కామెంట్స్ వస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ మూవీలో హనుమంతుడి పాత్ర గెటప్ నుఅసంబద్దంగా చూపిస్తూ ఉండటంతో ఈ మూవీని బ్యాన్ చేయాలని అయోధ్య రామాలయం పూజారి ఒకరు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికితోడు అజయ్ దేవగన్ కు చెందిన విఎఫ్ఎక్స్ కంపనీ ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ తాము చేయలేదని ఓపెన్ గా చెప్పడం మరింత సంచలనంగా మారింది.

అయితే లేటెస్ట్ గా విడుదలైన ఈ మూవీకి సంబంధించిన త్రీడి వెర్షన్ టీజర్ కు మంచి ప్సందన రావడంతో కొంతవరకు ఈమూవీ యూనిట్ ఊపిరి పీల్చుకుంది. ఈ సినిమా విడుదలకు ఇంకా మూడు నెలలు సమయం ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ సినిమా చుట్టూ అలుముకుంటున్న వివాదాలు వల్ల సినిమా వార్తల గురించి పట్టించుకోని సగటు వ్యక్తులు కూడ ఈసినిమా గురించి మాట్లాడుకునే లా చేయడంతో ‘ఆదిపురుష్’ విడుదల కాకుండానే నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ గా మారింది..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: