శేఖర్ కమల... ధనుష్ కాంబినేషన్ మూవీ ప్రారంభం అయ్యేది అప్పుడే..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శేఖర్ కమల ఇప్పటికే ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడి గా ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే శేఖర్ కమ్ముల ఆఖరుగా నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.

లవ్ స్టోరీ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరి పోయే క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన ధనుష్ తో  పాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్లు ఒక వార్త బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చి చాలా కాలమే అవుతున్న ఇప్పటి వరకు ఈ మూవీ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి మూవీ మేకర్స్ సమయాన్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. వచ్చే సంవత్సరం జనవరి నుండి ఈ మూవీ షూటింగ్ నీ ప్రారంభించే ఉద్దేశంలో మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది ఇలా ఉంటే ధనుష్ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన తిరు మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. అలాగే ధనుష్ తాజాగా నేనే వస్తున్న అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ప్రస్తుతం ధనుష్ , వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తెలుగు లో సార్ అనే టైటిల్ తో విడుదల కానుండగా ,  తమిళ్ లో వెత్తి అనే టైటిల్ తో విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: