హీరోయిన్ లేకుండా నటించి.. హిట్టు కొట్టిన హీరోలు వీళ్లే?

praveen
సాధారణంగా సినిమాలు కథ  కథనం ఎంత ముఖ్యమో.. హీరో హీరోయిన్లు ఎవరు అన్నది కూడా అంతే ముఖ్యం  హీరో సరసన సరిగ్గా సూట్ అయ్యే హీరోయిన్ లేకపోతే ఎక్కడో తేడా కొట్టేసి చివరికి సినిమా ఫ్లాప్ అవడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమంది హీరోలు మాత్రం తమ పక్కన హీరోయిన్ లేకున్నా సరే హిట్టు కొట్టగలం అని ఇప్పటివరకు నిరూపించారు అని చెప్పాలి. నటనతో హీరోయిన్ లేదే అనే భావన ప్రేక్షకులకు కలగకుండా బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. చిరంజీవి సైతం ఇలాంటి హిట్ అందుకున్నారు అన్న విషయం తెలిసిందే.

 ఇటీవల గాడ్ ఫాదర్ అనే సినిమాలో నటించారు చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్కు తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. దసరా సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ లేకుండా సింగిల్ గా నటించిన చిరంజీవి తన నటనతో మెప్పించి బ్లాక్ బస్టర్ కొట్టేసాడు.

 బాలకృష్ణ : బాలకృష్ణ ఇప్పటివరకు ఎంతో మంది హీరోయిన్లతో జతకట్టి ప్రేక్షకులను అలరించాడు అన్న విషయం తెలిసిందే. కానీ వేములవాడ భీమకవి అనే సినిమాలో మాత్రం బాలకృష్ణ హీరోయిన్ లేకుండానే ఒంటరిగా నటించారు. ఇక తర్వాత తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణంలో కూడా నారదుడు పాత్రలో ఎలాంటి హీరోయిన్ లేకుండా నటించారు. మొన్నటికి మొన్న బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన అఖండ సినిమాలో కూడా టైటిల్ పాత్ర దారికి ఎలాంటి హీరోయిన్ ఉండదు.

 నాగార్జున : అక్కినేని నాగార్జున అంటే టాలీవుడ్ మన్మధుడు అంటారు అందరూ. ఇప్పటివరకు ఎంతో మంది హాట్ హీరోయిన్లతో నటించారు నాగార్జున. కానీ షిరిడి సాయి, గగనం లాంటి సినిమాల్లో మాత్రం హీరోయిన్ లేకుండానే మెప్పించారు. రాజు గారి గది 2, ఆఫీసర్ లాంటి సినిమాలు కూడా హీరోయిన్ లేకుండానే నాగార్జున నటనతో మెప్పించారు.

 వెంకటేష్ : ఫ్యామిలీ హీరోగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వెంకటేష్ ఎంతోమంది హీరోయిన్లతో కలిసి నటించారు. కానీ ఈనాడు సినిమాలో మాత్రం వెంకటేష్ సరసన ఏ హీరోయిన్ ఉండదు అని చెప్పాలి.
 కమల్ హాసన్ : ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించిన లోక నాయకుడు కమలహాసన్..మొన్నటికి మొన్న విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టిన విక్రమ్ సినిమాల్లో మాత్రం హీరోయిన్ లేకుండానే నటించి ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డులు తిరగ రాసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: