అజిత్ మరియు విజయ్ అభిమానుల మధ్య వార్...!!

murali krishna
తన పని తాను చేసుకుంటూ పోయే వ్యక్తిగా.. సినీ రంగంలో నటుడు అజిత్‌కంటూ ప్రత్యేక స్థానం ఉంది. స్టార్‌ హీరోగా రాణిస్తున్న ఈయనకు అభిమాన గణం చాలా ఎక్కువే ఉంది.
అయినా అభిమాన సంఘాలు వంటివి వద్దని స్ట్రిక్ట్‌గా హెచ్చరిస్తారు. ఇక తనకు ఇష్టమైన మోటారు బైక్‌ రేస్, రైఫిల్‌ షూట్‌ వంటి విషయలపై ఆసక్తి చూపుతారు.
ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలపైనా స్పందించరు. మరో స్టార్‌ నటుడు విజయ్‌. ఈయన చాలా కూల్‌గా తన పని తాను చేసుకుపోయే నటుడు. అయితే విజయ్‌ తన అభిమానులను ప్రోత్సహిస్తారు. వారిని సేవా కార్యక్రమాలు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తారు. కాగా విజయ్, అజిత్‌ మధ్య వృత్తి పరంగా ఆరోగ్యకరమైన పోటీ ఉన్నా, వ్యక్తిగతంగా మంచి స్నేహం ఉంది. వీరు కలుసుకునేది అరుదే అయినా ఆ సమయంలో చాలా స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటారు.
అయితే వారి అభిమానులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. తమ హీరో గ్రేట్‌.. తమ హీరో తోపు అంటూ వాదించుకుంటారు. ఇక తమ అభిమాన హీరోల చిత్రాల విడుదల సమయంలో వీరు చేసే హంగామా మామూలుగా ఉండదు. అలాంటిది ఈ హీరోని ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదల అయితే వారి అభిమానుల మధ్య జరిగే యుద్ధం అంతా ఇంతా కాదు. దీంతో సాధారణంగా విజయ్, అజిత్‌ సినిమాలు ఒకేసారి విడుదల కాకుండా చూసుకుంటారు.
: (మీకు నయన్‌ సూపర్‌స్టార్‌ గానే తెలుసు..: విఘ్నేష్‌ శివన్‌)
అయితే విజయ్‌ హీరోగా నటిస్తున్న వారీసు చిత్రం సంక్రాంతి సందర్భంగా తమిళం, తెలుగు భాషల్లో నేరుగా విడుదలకు సిద్ధమవుతోంది. అదే విధంగా అజిత్‌ కథానాయకుడి గా నటిస్తున్న తుణివు చిత్రం కూడా సంక్రాంతి బరిలోకి ఉండబోతోంది. దీంతో ఇప్పటి నుంచే వీరిద్దరి అభిమానుల మధ్య వార్‌ మొదలైంది. ఇలాంటి అభిమానుల మధ్య గొడవ అనేది మదురై జిల్లాలోనే ఎక్కువగా జరుగుతుంటుంది.
అదే విధంగా అజిత్‌ చిత్ర ఫస్ట్‌లుక్, విజయ్‌ చిత్ర పోస్టర్ల వ్యవహారంలో ఆదివారం మదురైలో అభిమానులు గొడవకు దిగారు. గోడలపై తమ అభిమాన హీరో పోస్టర్‌ మాత్రమే పైభాగంలో ఉండాలంటూ ఘర్షణ పడ్డారు. ఫలితంగా ఆ ప్రాంతంలో కలకలం రేగింది. చిత్రాల విడుదలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఇలాంటిగొడవలు ఇంకెన్ని జరుగుతాయో అనే చర్చ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: