హిట్ లిస్ట్ లో గాడ్ ఫాదర్..!!

murali krishna
ఒకరు కాదు.. ఇద్దరు మెగా స్టార్లు ఒకే తెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది? అచ్చం గాడ్ ఫాదర్  సినిమా లా ఉంటుంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కీ రోల్ లో యాక్ట్ చేయగా, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్  ఖాన్ మొదటి సారి చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో గాడ్ ఫాదర్ పై అంచనాలు మరింత పెరిగాయి. ఇక సినిమా పొలిటికల్ బ్యాగ్రౌండ్ నేపథ్యంలో రూపుదిద్దుకోవడంతో అంతటా ఆసక్తి చూపారు. లూఫిసర్ రిమేక్ అయినప్పటికీ తెలుగుకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు హైప్ ను క్రియేట్ చేశారు. అచార్య  సినిమా ఫ్లాప్ తర్వాత మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకోవాలనుకుంటే ఈ రివ్యూ చదువాల్సిందే.
 ఈదే స్టోరీ.
నిజాయితీ గత సీఎం పీకేఆర్‌. ఆయన కూతురు సత్య ప్రియ(నయనతార) అల్లుడు జయదేవ్‌ (సత్యదేవ్‌). సీఎం పీకేఆర్‌ మరణంతో నెలకొన్న రాజకీయ అనిశ్చితి గురించి సినిమా కథ సాగుతుంది. పీకేఆర్ అల్లుడు జయదేవ్‌ సీఎం పీఠంపై కన్నేస్తాడు. డ్రగ్స్ బిజినెస్ చేసే జయదేవ్‌ ని సీఎం పీఠంపై కూర్చోనివ్వద్దని పీకేఆర్ తనయుడు బ్రహ్మా(చిరంజీవి) నిర్ణయించుకుంటాడు. అందుకు బ్రహ్మ చేసిన పని ఏంటీ? ఇంతకు సీఎం పీకేఆర్‌, బ్రహ్మ మధ్య ఉన్న సంబంధం విషయంలో ఉన్న వివాదం ఏంటీ? అనే విషయాలు సినిమా చూసి మీరు తెలుసుకోవాల్సిందే.
లూఫిసర్ కు వంద రెట్లు
గాడ్ ఫాదర్ మాలీవుడ్ లూఫిసర్ మూవీ అయినప్పటికీ.. అంతకుమించి ఉంది. దర్శకుడు మోహన్ రాజకు రిమేర్ రాజా అని పేరుంది. అందుకు తగ్గట్టుగానే మెగాస్టార్ చిరంజీవిని గాడ్ ఫాదర్ గా మలిచిన తీరు బాగుంది. ఆచార్య’లో డల్ పెర్ఫార్మెన్స్ తర్వాత చిరు తనదైన స్టయిల్ లో ఆకట్టుకున్నాడు. సత్యదేవ్ కనికరం లేని, అధికారాన్ని కోరుకునే క్రూక్ పాత్రలో తనదైన నటనను ప్రదర్శించాడు. నయనతార తన ‘లూసిఫర్’ సరసన మంజు వారియర్ కంటే భిన్నంగా ఉంటుంది. మురళీ శర్మ తన ‘అల వైకుంఠపురములో’ నటించిన పాత్ర ఏవిధంగా పేరు తీసుకొచ్చిందో, గాడ్ ఫాదర్ లో కూడా డిఫరెంట్ రోల్ తో ఆకట్టుకున్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ స్క్రిప్ట్ ఆధారితంగా ఎంట్రీ ఇచ్చాడు. సల్మాన్ స్టెప్పులు గాడ్ ఫాదర్ కు మరింత వన్నె తెచ్చాయి. ఇక పూరి జగన్నాధ్ జర్నలిస్టు పాత్రలో కనిపించి మెస్మరైజ్ చేశాడు. ఇక తాన్య రవిచంద్రన్, దివి వడ్త్యాల నటన కూడా బాగుంది. మాస్‌ పొలిటికల్‌ డ్రామాగా గాడ్‌ ఫాదర్‌ సాగింది. చిరంజీవి అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా మెగాస్టార్‌ చిరంజీవి నుండి ఏదైతే ఆశిస్తున్నారో అదే ఈ సినిమా ద్వారా దక్కుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: