మొదటి సినిమాతోనే హిట్ కొట్టేసిన బెల్లంకొండ?

Purushottham Vinay
సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు హార్డ్ వర్క్ అనేది కాకుండా ఎంతలేదన్నా లక్ ఫ్యాక్టర్ బాగా పనిచేస్తుంటుంది.ముఖ్యంగా డెబ్యూ సినిమాలు చేసేటప్పుడు టాలెంట్ ఎంత ఉన్నా దానికి లక్ కూడా ఖచ్చితంగా తోడావ్వల్సిందే.ఇప్పుడు కొత్త హీరో గణేష్ బెల్లంకొండ కి లక్ కలిసొచ్చిందని చెప్పాలి. అప్పుడెప్పుడో గణేష్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో ఓ సినిమా మొదలైంది. షూట్ మొదలైన కొన్ని రోజులకే ఆ సినిమా ఆగిపోవడంతో గణేష్ సితార బేనర్ లో లక్ష్మణ్ అనే కొత్త దర్శకుడితో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. అదే స్వాతి ముత్యం. కథను నమ్మి తన డెబ్యూ సినిమాను లక్ష్మణ్ తో చేశాడు గణేష్.దసరా సీజన్ లో ఇటు చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ అటు నాగార్జున ‘ది ఘోస్ట్’ పోటీ పడుతుంటే మధ్యలో స్వాతి ముత్యం చేరింది. రిలీజ్ డేట్ ప్రకటించగానే ఈ చిన్న సినిమా పెద్ద సినిమాల మధ్య నలిగిపోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ స్వాతి ముత్యం కొన్నేళ్ళ క్రితం వచ్చిన శతమానం భవతి సినిమాను గుర్తుచేసింది. అవును ఇటు చిరు ‘ఖైది నెంబర్ 150’ అటు బాలయ్య ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ ల నడుమ సంక్రాంతి కానుకగా విడుదలైన శతమానం భవతి సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని రోజు రోజుకి వసూళ్ళు పెంచుకుంటూ దూసుకెళ్ళింది.


సరిగ్గా ఇప్పుడు స్వాతి ముత్యం విషయంలో కూడా అదే రిపీట్ అయింది. ఒకరోజు ముందే ప్రీమియర్ షో పడటంతో సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.దీంతో ఇవ్వాళ ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం కనిపిస్తుంది.దసరా సీజన్ లో పర్ఫెక్ట్ ఫ్యామిలీ సినిమా అనే ట్యాగ్ అందుకోవడంతో స్వాతి ముత్యం కి బుకింగ్స్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ రెండు మూడు రోజులు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వస్తే కలెక్షన్ల పరంగా సూపర్ హిట్టయినట్టే. ఏదేమైనా మొదటి సినిమా ఆగిపోవడం ఈ సినిమా డెబ్యూ మూవీగా రిలీజ్ అవ్వడం పైగా రెండు బడా సినిమాల మధ్య సూపర్ హిట్ టాక్ అందుకోవడం ఇవన్నీ గమనిస్తే బెల్లంకొండ గణేష్ లక్కీ హీరో అనిపిస్తుంది.చూడటానికి కూడా ఈ హీరో బాగుండటంతో ఫ్యూచర్ లో మంచి హిట్లు పడితే బాగా పాపులర్ అయ్యే అవకాశాలు వున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: