'ది ఘోస్ట్' మూవీ క్లాస్ తీసిన పక్కా మాస్ మూవీ... ప్రవీణ్ సత్తార్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ ఉన్న దర్శకులలో ప్రవీణ్ సత్తార్ ఒకరు. ఈ యువ దర్శకుడు చందమామ కథలు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత సిద్దు జొన్నలగడ్డ హీరోగా గుంటూర్ టాకీస్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని సాధించ లేక పోయింది. ఆ తర్వాత ప్రవీణ్ సత్తార్ ,  రాజశేఖర్ హీరోగా గరుడ వేగ అనే మూవీ ని తెరకెక్కించాడు.

ఈ మూవీ అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సాధించడంతో ప్రవీణ్ సర్దార్ క్రేజ్ అమాంతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో పెరిగి పోయింది. ప్రవీణ్ సత్తార్ 'గరుడ వేగ' లాంటి భారీ బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా ది ఘోస్ట్ అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ లో నాగార్జున మరియు జోనల్ చౌహాన్ ఇద్దరు కూడా ఇంటర్పోల్ ఆఫీసర్ లుగా కనిపించ బోతున్నారు. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా దర్శకుడు ప్రవీణ్ సత్తార్ 'ది ఘోస్ట్' మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ప్రవీణ్ సత్తార్ మాట్లాడుతూ ... హై ఎమోషన్స్ మరియు హీరోయిజం ఉన్న మూవీ ఇది. ఈ మూవీ లో చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి. అలాగే విజిల్ వేసే మూమెంట్స్ కూడా ఉంటాయి. క్లాస్ గా తీసిన పక్కా మాస్ మూవీ ఇది అని తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ప్రవీణ్ సత్తార్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: