ఆదిపురుష్ సెంటిమెంట్ ఏంటో తెలుసా...?

murali krishna
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్‌ సినిమా వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.


భారీ అంచనాలున్న ఆదిపురుష్‌ సినిమా టీజర్ ని రేపు దసరా కానుకగా విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన పోస్టర్ ఇప్పటికే విడుదల అయ్యి అంచనాలను ఆకాశానికి పెంచేసింది. రేపు అయోధ్య లో భారీ ఎత్తున జరగబోతున్న ఈవెంట్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యం లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.


మీడియా వారికి ఎక్కువగా ఆహ్వానం లేదు, తెలుగు మీడియాను కూడా ఆహ్వానించ లేదు. హిందీ కి సంబంధించిన కొద్ది మంది మీడియా వారిని ఆహ్వానించబోతున్నారు. రేపు సాయంత్రం జరగబోతున్న భారీ ఈవెంట్ లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ టీజర్ ని విడుదల చేయబోతున్నారు. దాదాపు రెండు నిమిషాల నిడివి ఉండే ఈ టీజర్ కి సంబంధించిన విజువల్స్ కొన్ని సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి, అవి అంచనాలు భారీగా పెంచాయి.


ఇక యూట్యూబ్ లో టీజర్ ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. రేపు సాయంత్రం 7 గంటల 11 నిమిషాలకు ఆదిపురుష్‌ టీజర్ ని యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారట.ఇప్పటి వరకు ఆదిపురుష్‌ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఉదయం 7 గంటల11 నిమిషాలకు దర్శకుడు ఇచ్చాడు. ఈ సారి మాత్రం టీజర్ ని సాయంత్రం 7 గంటల 11 నిమిషాలకు ఇవ్వబోతున్నాడు. ఇంతకు ఈ 7 గంటల 11 నిమిషాల సెంటిమెంట్ ఏంటో కానీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రేపు టీజర్ సంచలన రికార్డులు నమోదు చేసేలా వ్యూస్ కూడా దక్కించుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: