చందు మొండేటి పాన్ ఇండియా సినిమా నిజమేనా!!

P.Nishanth Kumar
సక్సెస్ లో ఉన్న డైరెక్టర్ లకు వచ్చే ఆఫర్స్ వేరు. అందులోనూ ఓ మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా తో హిట్ కొడితే ఆ దర్శకుడితో సినిమా చేయడానికి అందరు ఎంతో ఆసక్తి తో ఎదురుచూస్తూ ఉంటారు. అలా ఇటీవలే భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు చందు మొండేటి. టాలీవుడ్‌లో ఉన్న యంగ్‌ డైరెక్టర్‌లలో చందూ మొండేటి ఒకరు. మొదటి నుంచి అయన సినిమాలు ఎంతో వైవిధ్యభరితంగా ఉంటాయి. రెగులర్ కథలను కాకుండా వెరైటీ కథలను చేయటానికి అయన ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలా అయన 'కార్తికేయ' సినిమాతో మంచి విరాజయం అందుకోవడంతో పాటు ఈ దర్శకుడు అందరి దృష్టిని ఆకర్షించాడు.
అలాంటి సినిమా తో కూడా సూపర్ హిట్ కొట్టొచ్చా అనే అయన ఈ సినిమా ద్వారా నిరూపించాడు. అయితే అయన కాన్సెప్ట్ లు కొన్ని ప్రేక్షకులకు ఎక్కలేదు. ఫలితంగా దారుణమైన పరాజయాలను కూడా అందుకున్నాడు. ఈ నేపథ్యంలో అయన చాలా గ్యాప్ తీసుకుని మరీ కార్తికేయ సినిమా సీక్వెల్‌ 'కార్తికేయ2'తో ప్రేక్షకుల ముందుకు పోయిననేలలో వచ్చాడు. అది దేశ వ్యాప్తంగా అఖండ విజయాన్ని అందుకుని అందరి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ఈ దర్శకుడికి మంచి పేరొచ్చింది ఆ సినిమా ద్వారా. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
మంచి కాన్సెప్ట్ దానికి తగ్గ డైరెక్షన్ తోడవడంతో ఈ సినిమా ఇంత పెద్ద సూపర్ హిట్ అయ్యింది. ఎక్కువ ప్రమోషన్స్ కూడా చేయకుండానే 100 కోట్లకు పైగా వసూళ్లు చేసి ఊహించని రికార్డు అందుకుంది. ముందుగా పాన్ ఇండియా సినిమా గా దీన్ని చేయాలనుకోలేదు. మధ్యలో దీనికి వస్తున్న రెస్పాన్స్ చూసి అందరు ఈ సినిమా ను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయాలనుకున్నారు. తాజాగా ఈ  ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్‌కు వరుస ఆఫర్లు వస్తున్నాయఅంటున్నారు. అందులో భాగంగా గీత ఆర్ట్స్ లో అయన వందకోట్ల పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నాడట. ఇందులో ఎంతవరకు నిజంగా ఉందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: