'టైగర్ నాగేశ్వరరావు' మూవీలో ఆమె పాత్ర చాలా కీలకమట..!

Pulgam Srinivas
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కు తుంది . ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే చాలా కాలం అవుతుంది . ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది . ఈ మూవీ కి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో రేణు దేశాయ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ లో రేణు దేశాయ్ ... హేమలత లవణం అనే పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే రేణు దేశాయికి సంబంధించిన ఒక వీడియోను కూడా మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియోలో రేణు దేశాయ్ అద్భుతమైన లుక్ లో కనిపించడంతో ఈ వీడియోకు ప్రేక్షకులు నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ వీడియో ద్వారా రేణు దేశాయ్ పాత్ర పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడం మాత్రమే కాకుండా , ఈ మూవీ పై  కూడా ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం టైగర్ నాగేశ్వరరావు మూవీ లో హేమలత లవణం పాత్రలో నటిస్తున్న రేణు దేశాయ్ క్యారెక్టర్ చాలా కీలకం అని , ఈ మూవీ కే ఈ పాత్ర హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల తర్వాత రేణు దేశాయ్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. టైగర్ నాగేశ్వరరావు మూవీ లో రవితేజ సరసన నుపూర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: