గాడ్ ఫాదర్: తమ్ముడి కోసం ఆ డైలాగులు?

Purushottham Vinay
టాలీవుడ్ బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మూవీ గాడ్ ఫాదర్ ఇప్పుడు విడుదలకు సిద్ధంగా వుంది. అయితే ఈమధ్య కాలంలో గాడ్‌ ఫాదర్‌ సినిమా ప్రమోషన్స్ నెమ్మదిగా సాగాయి అంటూ చేసిన కంప్లైంట్స్ అన్ని ఒకసారిగా ఎగిరిపోయాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.రెండు మూడు రోజుల్లోనే గాడ్ ఫాదర్ సీన్ అంతా మారిపోయింది. మొన్నటి వరకు ఈ సినిమా ప్రమోషన్స్ నెమ్మదిగా సాగాయి అంటూ చేసిన కంప్లైంట్స్ అన్ని ఒకసారిగా ఎగిరిపోయాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరీ ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ నాయకులకు తగిలేలా సెటైర్లు కూడా వేశారు మెగాస్టార్ చిరంజీవి.అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అన్న చందంగా ప్రస్తుతం రాజకీయ నాయకులు ఉన్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. సినిమాలో మురళీ శర్మ క్యారెక్టర్ గురించి చెప్తూ.. నేటితరం పొలిటికల్ లీడర్స్పై తన మాటల తూటాలు పేల్చాడు మెగాస్టార్ . ఒకవైపు వర్షం జోరుగా కురుస్తున్న మరోవైపు తన మాటల వర్షంతో అభిమానులను పూర్తిగా తడిపేసాడు చిరంజీవి.14 ఏళ్ల కింద తన రాజకీయ ప్రస్థానం కూడా గుర్తు చేసుకుని.. దాన్ని కూడా గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ కోసం వాడుకుంటున్నాడు చిరంజీవి.


 నిజం చెప్పాలంటే 15 రోజుల క్రింది వరకు కూడా ఈ సినిమాపై అంచనాలు అంతగా లేవు. పైగా ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో.. బిజినెస్ కూడా ఊహించినంతగా జరగలేదు. అడ్వాన్స్ పద్ధతిలోనే సినిమాను కూడా అమ్మేశారు నిర్మాతలు. అయితే ట్రైలర్ విడుదలైన తర్వాత.. ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశాక పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి.చిరంజీవి సినిమా అంటే ఇలా ఉండాలి అనేలా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు గాడ్ ఫాదర్ టీం. అక్టోబర్ 1 న ముంబైలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అక్కడ కూడా సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు చిరంజీవి. దీనికి సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి పొలిటికల్ డైలాగులపై బాగానే డిబేట్లు జరుగుతున్నాయి. తాను రాజకీయాల్లో లేకపోయినా తమ్ముడు ఉన్నాడు కాబట్టి అతడికి పనికొచ్చేలా ఈ సినిమాలో కొన్ని డైలాగులు మెగాస్టార్ రాయించాడని సమాచారం తెలుస్తుంది.మరి ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: