ఈరోజు 'ఓటిటి' ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ఈ రోజు కొన్ని మూవీ లు 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యాయి. ఆ మూవీ లు ఏమిటి ఏవో ...  అవి ఏ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో  స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.
777 చార్లీ : కన్నడ సినిమా ఇండస్ట్రీ లో అదిరి పోయే క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన రక్షిత్ శెట్టి తాజాగా 777 చార్లీ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలుసు. ఈ మూవీ ఈ రోజు అనగా సెప్టెంబర్ 30 వ తేదీ నుండి తెలుగు ,  తమిళ ,  హిందీ , మలయాళ భాషల్లో పే ఫర్ వ్యూ పద్ధతిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటు లోకి వచ్చింది. ఎవరైనా ఈ మూవీ ని చూద్దాము అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో పే ఫర్ వ్యూ పద్ధతిలో చూడవచ్చు.


తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన ఆర్య తాజాగా కెప్టెన్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ థియేటర్ లలో పర్వాలేదు అనే రెంవ్ విషయాన్ని అందుకుంది. ఈ రోజు నుండి తమిళ్ మరియు తెలుగు భాషలో జీ 5  'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
రేయికి వెయ్యి కళ్ళు అనే సినిమా ఈ రోజు నుండి ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది.
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా గిరిసయ్య దర్శకత్వంలో తెరకెక్కిన రంగ రంగ వైభవంగా సినిమా ఈ రోజు నుండి అనగా సెప్టెంబర్ 30 వ తేదీ నుండి తెలుగు భాషలో నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలా ఈ రోజు నుండి ఈ మూవీ లు తెలుగు భాషలో 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: