సింగర్ మంగ్లీ ఆదాయం ఇప్పుడేంతో తెలుసా?

Satvika
సింగర్ మంగ్లీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఎన్నో పాటలకు తన గొంతును అందించింది.ప్రతిభ, అదృష్టం ఉంటే ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అని ఈమెని చూస్తే అర్థమవుతుంది.అదృష్టం ఒక్కటే ఉంటే అందలం ఎక్కడం కష్టం.. ప్రతిభ కూడా ఉండి అదృష్టం తోడైతేనే అద్భుతాలు ఆవిష్కారమవుతాయి. మంగ్లీ విషయంలో అదే జరిగింది. ఎక్కడో 5000 రూపాయల నెల వారి జీతం తీసుకుని ఉద్యోగం చేసుకునే మంగ్లీ అనూహ్యంగా ఒకానొక సమయంలో వి6 ఛానల్ లో జాబ్ చేసే ఒక అతనికి కనిపించడం ఏంటి.. అతడి ఆహ్వానం మేరకు ఆ చానల్లో తీన్మార్ అనే వార్త కార్యక్రమంలో పాల్గొనడం..

ఆమె భాష,వేషం ప్రత్యేకంగా చూపించారు.లంబాడ జాతికి చెందిన ఆమెను సరికొత్తగా ఆ ఛానల్ వారు చూపించడంతో పాటు ఆమెలో ఉన్న గాయనిని అద్భుతంగా ప్రేక్షకుల ముందు ఆవిష్కరించారు. ఆ ఛానల్ లో మంగ్లీ జాయిన్ అయిన సమయంలో నెలకు పది వేల రూపాయల జీతం ఇచ్చేవారని సమాచారం, చాలా తక్కువ సమయంలోనే మంగ్లీ ఎంతో మంది అభిమానంను సొంతం చేసుకుంది. తన గొంతుతో తన యొక్క బాడీ లాంగ్వేజ్ తో తన యొక్క ఉత్సాహపరిచే మాట తీరుతో ఆమె తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకుంది. దానికి తోడు ఆమె పాటలు ఒక్కొక్కటిగా సక్సెస్ అవుతూ వచ్చాయి. దాంతో హీరోయిన్ స్థాయి ఆమెకు దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు..

స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు ఆమె పాట తమ సినిమాలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారంటే ఆమె ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆమె ఒక్క పాట పాడితే 5 లక్షల రూపాయలు తీసుకుంటుంది, ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇక యూట్యూబ్లో ఆమె ఒక్క వీడియో పోస్ట్ చేస్తే మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చి లక్షల్లో ఆదాయం వస్తుంది. ఇంతగా ఆమె సంపాదిస్తుంది అంటే ఆమెలో ఉన్న ఆత్మవిశ్వాసం పట్టుదల ప్రతిభ వీటన్నిటికీ తోడు ఒకింత అదృష్టం. కనుక ప్రతి ఒక్కరు కూడా తమలో ఉన్న ప్రతిభను బయటకు తీసుకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి..మనకంటూ ఒక సమయంలో అదృష్టం రాక పోదు అప్పుడు మనం కూడా ఇలాగే పేరు తెచ్చుకునే అవకాశం రాక మానదు..ప్రయత్నించాలి అప్పుడే ఫలితం కూడా వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: