18 ఏళ్ల తర్వాత ఆ పాత్రతో రీ ఎంట్రీ ఇస్తున్న రేణు దేశాయ్..!!

Divya
హీరో రవితేజ నటించిన మొదటి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు.ఈ చిత్రాన్ని డైరెక్టర్ వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభం నుంచి పలు ఆసక్తికర నియంషంగా మారుతోంది. ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర జాతీయ అవార్డు గ్రహీత అనుపమ్ కేర్ కూడా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రేణు దేశాయ్ సంబంధించి ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. ఈ కొత్త షెడ్యూల్ కోసం సెట్ లోకి రేణు దేశాయ్ రావడం జరిగింది రచయిత సామాజిక కార్యకర్తగా చాలా కీలకమైన పాత్రలో ఈమె నటిస్తున్నట్లు ఒక వీడియోలో తెలియజేయడం జరిగింది.

రేణు దేశాయ్ ఈ చిత్రంలో హేమలత లవణం అనే పాత్రలో కనిపించబోతోంది దాదాపుగా 18 సంవత్సరాల తరువాత రేణు దేశాయ్ తిరిగి వెండితెర పైన రీఎంట్రీ ఇస్తూ ఉండడంతో పవన అభిమానులు కాస్త ఆనందంతో వెయిట్ చేస్తూ ఉన్నారు. టైగర్ నాగేశ్వరరావు పేరు మోసిన ఒక దొంగ స్టువర్టపురం దొంగగా అతడు ఎంతో పాపులర్ అయ్యారు. ఇక ఈ కథ అంశంగానే ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ కథ 1970 వ సంవత్సరంలో స్టువర్టపురం అనే గ్రామంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో రవితేజ సరసన సూపర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు. ఇక రవితేజ బాడీ లాంగ్వేజ్ ను పూర్తిగా ఈ సినిమా కోసం మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇటీవల డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. రవితేజ ఎనర్జీ ఈ సినిమా ప్రభావం పైన బాగా చూపిస్తుందని తెలిపారు. ఇక నిజ జీవిత పాత్ర హేమలత లవణం ఒక భారతీయ సామాజిక కార్యకర్త అన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వీడియో విషయానికి వస్తే రేణు దేశాయ్ ఈ వీడియోలో తెల్ల చీరలో కనిపించక మరో ఇద్దరు మహిళలు కూడా ఆమె వెనక నడుస్తూ వస్తున్నట్లుగా ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: