పొన్నియిన్ సెల్వన్1: తీరా రిలీజ్ టైంకి ఈ చిక్కులు ఏంటో?

Purushottham Vinay
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా "పొన్నియిన్ సెల్వన్ 1" విడుదలకు సిద్ధమైంది.ఈ నెల 30వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే ఈ చిత్రాన్ని ప్రదర్శనను అడ్డుకోడానికి థియేటర్ యజమానులకు బెదిరింపులు వస్తున్నాయనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 'PS-1' సినిమాని ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. మనదేశంలో కంటే కొన్ని గంటల ముందుగానే యూఎస్ఏలో ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. అలానే కెనడాలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అయితే అక్కడ కొందరు విధ్వంసకారులు ఈ సినిమా రిలీజ్ ను అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.


అయితే తెలుస్తున్న కొన్ని నివేదికల ప్రకారం 'పొన్నియన్ సెల్వన్' సినిమాని ప్రదర్శిస్తే.. థియేటర్ల మీద దాడి చేసి స్క్రీన్లను చింపివేస్తామని.. థియేటర్లను ధ్వంసం చేస్తామని కెనడాలోని కొందరు మత ఛాందసవాదులు ఇంకా విధ్వంసకారులు థియేటర్ యజమానులను బెదిరించారని తెలుస్తోంది. సిబ్బందిపై దాడి చేస్తామని హెచ్చరించారు.హామిల్టన్ - కిచెనర్ ఇంకా లండన్ లలోని ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. దీంతో థియేటర్ యజమానులు స్థానిక పోలీసులను ఆశ్రయించారని తెలుస్తోంది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్న అధికారులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటామని థియేటర్ యాజమాన్యాలకు హామీ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.ఏదేమైనా కెనడా వంటి ప్రజాస్వామ్య దేశంలో సినిమాల రిలీజులప్పుడు ఇలా బెదిరింపులు రావడం.. థియేటర్ కు వెళ్లి సినిమా చూడటానికి ఆలోచించాల్సిన పరిస్థితి రావడం విచారకరం.నిజానికి గతంలో కూడా అనేక తమిళ చిత్రాలకు కెనడాలో బెదిరింపులు ఇలాంటి వచ్చాయి. ఇప్పుడు 'పొన్నియిన్ సెల్వన్' కి కూడా బెదిరింపులు తప్పలేదు. మరి సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.ఇక మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పబడుతున్న 'పీఎస్ 1' సినిమాపై తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇది సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: