రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవి తేజ గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ప్రస్తుతం రవితేజ వరస మూవీ లలో నటిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటికే రవితేజ ఈ సంవత్సరం  ఖిలాడి , రామారావు ఆన్ డ్యూటీ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు మూవీ లు కూడా ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయాయి. ఇది ఇలా ఉంటే  రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.
 

ఈ మూవీ లో రవితేజ సరసన నుపుర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ,  రేణు దేశాయ్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించ బోతుంది. ఈ మూవీ కి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది.

ఈ మూవీ కి సంబంధించిన ఆన్ ఎక్సళరేటింగ్ అప్డేట్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. మరి టైగర్ నాగేశ్వరరావు మూవీ యూనిట్ ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఏ అప్డేట్ ను విడుదల చేస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: