మంచు లక్ష్మి ఈసారైనా సక్సెస్ అవుతుందా..?

Divya
ఓటిటి ఆహా వేదికగా ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ సంస్థ. ఇక పలు రకరకాల షోలతో, సినిమాలతో ,డిఫరెంట్ కాన్సెప్ట్లతో ఓటీటి ప్రేక్షకులను సైతం అలరిస్తూ ఉన్నది. ఇప్పుడు ఆహా వేదికగా చెఫ్ మంత్ర అనే ఒక ఫుడ్ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రసారం కానుంది. మొదటి సీజన్ వన్ కు శ్రీముఖి యాంకర్ గా ఉండగా అంతగా సక్సెస్ అయ్యింది.. ఇక ఈ నేపథ్యంలోనే చెఫ్ మంత్ర-2 కార్యక్రమం కోసం ఆహా సంస్థ ప్లాన్ చేసిన సంగతి తెలిసినదే.. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.

ఈ కార్యక్రమం కోసం మంచు లక్ష్మిన హోస్ట్ గా చేస్తున్నారు. ఈ షో ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను సైతం ఆహ్వానించి వారి చేత పలు వంటకాలను చేయించి ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానాలను రాబట్టే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే అందుకు సంబంధించి ఒక ప్రోమో కూడా విడుదల అవ్వడం జరిగింది. సెప్టెంబర్ 30 నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి తన సంతోషాన్ని తెలియజేస్తూ తాను ఇలా ఫుడ్ కార్యక్రమానికి  హోస్ట్ గా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసింది.

మొట్టమొదటిసారిగా ఇందులో అతిథిగా హీరోయిన్ మాళవిక మోహన్ పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే అందుకు సంబంధించి షూట్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ షో తో నైనా మంచు లక్ష్మి సక్సెస్ అవుతుందా అనే విషయం అందరిలోనూ సందేహాన్ని కలిగిస్తోంది. మాళవిక మోహన్ మాత్రం తెలుగులో డైరెక్ట్ గా ఎంట్రీ ఇవ్వలేదు కేవలం మలయాళం, హిందీ, తమిళ్ వంటి కొన్ని సినిమాలలో మాత్రమే నటిస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది స్టార్ హీరోల సరసన కూడా నటించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: