నాగచైతన్య 22వ మూవీలో ఆ క్రేజీ తమిళ నటుడు..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు ఆయన నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య ఇప్పటికే అనేక మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించు కున్నాడు. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య ఆఖరుగా థాంక్యూ మూవీ తో  ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించగా , రాశి ఖన్నా ఈ మూవీ లో నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన థాంక్యూ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది.

ఇది ఇలా ఉంటే నాగ చైతన్య ప్రస్తుతం తమిళ క్రేజీ దర్శకుడు అయినటు వంటి వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో నాగ చైతన్య సరసన కృతీ శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ నాగ చైతన్య కెరియర్ లో 22 వ మూవీ గా తెరకెక్కుతుంది. ఈ మూవీ కి ఇళయరాజా ,  యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ...  నాగ చైతన్య ,  వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ లో ఒక కీలకమైన పాత్రలో తమిళ క్రేజీ నటుడు అయినటు వంటి అరవింద్ స్వామి కనిపించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విడుదల అయిన ధ్రువ అనే తెలుగు సినిమాలో అరవింద్ స్వామి ప్రతి నాయకుడు పాత్రలో నటించి మెప్పించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: