గాడ్ ఫాదర్ లో ఆ డైలాగులు ఉన్నాయా ?

Seetha Sailaja
మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘గాడ్ ఫాదర్’ మూవీలో చాల రాజకీయ డైలాగుల సెటైర్లు ఉన్నాయి అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈమూవీ గురించి బయటకు వస్తున్న లీకుల ప్రకారం ఈమూవీలో చిరంజీవి ఇరు రాష్ట్ర తెలుగు ప్రభుత్వాలను టార్గెట్ చేసేవిధంగా తన పాత్ర ద్వారా సెటైరుకల్ డైలాగ్స్ వేసినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అనేక విమర్శకులకు అవకాశం ఇస్తున్న మూడు రాజధానుల అంశం తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు సక్రమంగా జరగకుండా ఆగిపోయిన ఆస్థుల పంపకం పోలవరం ప్రాజెక్ట్ జాతీయ హోదా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా లాంటి సున్నితమైన రాజకీయ అంశాల పై చిరంజీవి పంచ్ డైలాగులు ఉన్నట్లు లీకులు వస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసిన చిన్న డైలాగ్ పెను ప్రకంపనలు సృష్టించిన నేపద్యంలో ఇప్పుడు ఈమూవీలో ఈరాజకీయ డైలాగులు అన్నీ నిజంగా ఉంటే ధియేటర్లు చప్పట్లతో మారుమ్రోగి పోవడం ఖాయం అని అంటున్నారు.

మరీ ముఖ్యంగా సినిమాతారలు రాజకీయాలలోకి విపరీతంగా వస్తున్న విషయం పై కూడ ఈమూవీలో కొన్ని సెటైర్లు ఉన్నాయి అని అంటున్నారు. అయితే ఈ సెటైర్లకు సెన్సార్ నుండి ఎలాంటి అభ్యంతరం తెలపక పోవడంతో ఈడైలాగులు అన్నీ యధాతధంగా ఈమూవీలో ఉన్నాయి అంటున్నారు. అయితే ఈవిషయమై మరొక వాదన కూడ వినిపిస్తోంది. చిరంజీవి ధైర్యం చేసి ఇలాంటి పొలిటికల్ పంచ్ డైలాగులు ‘గాడ్ ఫాదర్’ లో వేసి ఉండడని ఇది అంతా ఈమూవీ పై మ్యానియా పెంచడానికి సోషల్ మీడియాలో ఇస్తున్న లీకులు అని అంటున్నారు.

‘లూసీఫర్’ మూవీ పొలిటికల్ మూవీ అయితే ఈమూవీ కథకు చాల మార్పులు చేర్పులు చేసి ‘గాడ్ ఫాదర్’ తీసారు. వాస్తవానికి ‘లూసీఫర్’ మూవీని ఇప్పటికే అనేకమంది ఓటీటీ లో అనేకసార్లు చూసిన నేపధ్యంలో ‘గాడ్ ఫాదర్’ జనంలోకి వెళ్ళాలి అంటే ఇలాంటి పొలిటికల్ పంచ్ డైలాగ్స్ ఉంటే కానీ సగటు ప్రేక్షకుడు చూడడు అన్న ఉద్దేశ్యంతో ఇలాంటి వ్యూహాలతో వస్తున్నారా అన్న సందేహాలు కూడ వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: