దళపతి విజయ్ 'వరసు' మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న దళపతి విజయ్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరి పోయే క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన ,  దళపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు  ఈ మూవీ తమిళ్ మరియు తెలుగు భాషలలో తెరకెక్కుతుంది. తమిళ్ లో ఈ మూవీ వరసు అనే టైటిల్ తో విడుదల కానుండగా ,  తెలుగు లో ఈ మూవీ వారసుడు అనే టైటిల్ తో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం దళపతి విజయ్ కి సంబంధించిన కొన్ని పోస్టర్ లను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి అదిరి పోయి రేంజ్ రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో అవుతుంది. వరిసు మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయినటు వంటి అమెజాన్ ప్రైమ్ వీడియో 'ఓ టి టి' సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. ఇది ఇలా ఉంటే వరసు సినిమాపై తమిళ , తెలుగు ఇండస్ట్రీ లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: