"డీజే టిల్లు" హీరో సాహసం చేస్తున్నాడా ?

VAMSI
టాలీవుడ్ లో కేవలం టాలెంట్ ను నమ్ముకుని ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అయినా చాలా మంది హీరోలలో యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ ఒకరు. తనలో అద్భుతమైన నటన ఉన్నా కానీ వరుసగా అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. అయితే కొంచెం గ్యాప్ తీసుకుని తీసిన సినిమా "డీజే టిల్లు". ఈ సినిమాకు వచ్చిన స్పందన మాములుగా లేదు.. అన్ని వర్గాల వారికి ఈ సినిమాలో ప్రతి ఒక్క సీన్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని అందరికీ మంచి లాభాలను తెచ్చి పెట్టి హిట్ లిస్ట్ లో చేరిపోయింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి పేరును తీసుకువచ్చింది.
ఇక సినిమా థియేటర్ నుండి వెళ్లిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియాలోనూ రీల్స్, షార్ట్స్ రూపంలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. అంత మంచి సినిమాను మనకు అందించిన దర్శకుడు విమల్ కృష్ణను ఈ విషయంలో మెచ్చుకుని తీరాల్సిందే. అయితే ఇంతటి హిట్ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ తీయాలని హీరో మరియు రచయిత సిద్దు జొన్నలగడ్డ సంకల్పించారు. అయితే వాస్తవంగా సీక్వెల్ కు కూడా విమల్ కృష్ణనే అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత దర్శకుడి విషయంలో కొంత గందరగోళానికి గురయ్యారు. ఒకానొక సమయంలో స్వయంగా సిద్దు డైరెక్ట్ చేయాలని కూడా అనుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ను ఒక ఫెయిల్యూర్ దర్శకుడి చేతిలో పెట్టారట. నిన్నటి నుండి ఈ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లిందట. ఇంతకు ముందు బాలీవుడ్ సినిమా "విక్కీ డోనార్" ను తెలుగులో "నరుడా డోనరుడా" పేరుతో వచ్చింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక ఫెయిల్యూర్ అయింది. మరోసినిమా "అద్భుతం" కూడా ప్లాప్ గా నిలిచింది. ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన మల్లిక్ రామ్ అనే యంగ్ డైరెక్టర్ కు ఈ ప్రాజెక్ట్ ను ఇచ్చారట. అయితే హిట్ సినిమా సీక్వెల్ ను ప్లాప్ డైరెక్టర్ చేతిలో పెట్టడం పట్ల డీజే టిల్లు ఫ్యాన్స్ కావొచ్చు, అలాగే ఇండస్ట్రీ వర్గాలు కావొచ్చు సహాయం చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూద్దాం ఏమి జరుగుతుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: