హిందీ 'విక్రమ్ వేద' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి... రన్ టైమ్ కూడా లాక్..!

Pulgam Srinivas
2017 వ సంవత్సరంలో విడుదల అయిన తమిళ విక్రమ్ వేద సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుందో మనందరికీ తెలిసిందే. తమిళ విక్రమ్ వేద సినిమా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ కూడా రాబట్టింది. విక్రమ్ వేద మూవీ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. తమిళ విక్రమ్ వేద మూవీ లో మాధవన్ ,  విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీ ద్వారా మాధవన్ మరియు విజయ్ సేతుపతి కి మంచి గుర్తింపు లభించింది.

బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించి అద్భుతమైన కలెక్షన్లను రాబట్టిన విక్రమ్ వేద మూవీ ని తాజాగా హిందీ లో విక్రమ్ వేద పేరుతో రీమేక్ చేశారు. ఈ మూవీ కి పుష్కర్ - గాయత్రి దర్శకత్వం వహించారు. హిందీ విక్రమ్ వేద మూవీ లో హృతిక్ రోషన్ ,  అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ని సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.

ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ని కూడా లాక్ చేసినట్లు సమాచారం. విక్రమ్ వేద సినిమా 2 గంటల 40 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. మరి హిందీ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న విక్రమ్ వేద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: