కెప్టెన్ మూవీ అఫీషియల్ 'ఓటిటి' విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయిన ఆర్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్య ఇప్పటికే కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి తెలుగు కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఆర్య నటించిన కొన్ని సినిమాలు తెలుగు లో కూడా డబ్  అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ లో కూడా మంచి విజయాలను అందుకున్నాయి. వాటితో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా ఆర్య కు మంచి క్రేజీ లభించింది. ఆర్య ,  గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన వరుడు మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.
 

ఇది ఇలా ఉంటే తాజాగా ఆర్య ,  శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన కెప్టెన్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ లో కావ్య శెట్టి ,  ఐశ్వర్య లక్ష్మి ముఖ్య పాత్రాలలో నటించారు. తాజాగా ఈ మూవీ 'ఓ టి టి' విడుదల తేదీని సంబంధించిన అధికారిక ప్రకటన వెలబడింది. ఈ మూవీ ని జీ 5 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో సెప్టెంబర్ 30 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు జి ఫైవ్ 'ఓ టి టి' సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ ని ఎవరైనా థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే సెప్టెంబర్ 30 వ తేదీ నుండి ఈ మూవీ జీ 5 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: