బ్రహ్మస్త్ర స్ట్రాటెజీ మాములుగా లేదుగా...?

murali krishna
సెప్టెంబర్ 9 ప్రపంచవ్యాప్తం గా విడుదలైన బ్రహ్మాస్త్ర (Brahmastra) చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తోపాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది


రణ్ బీర్ కపూర్‌, అలియాభట్ హీరోహీరోయిన్లుగా..స్టార్ హీరోలు షారుక్ ఖాన్‌, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్ కీలక పాత్రల్లో వచ్చిన ఈ సినిమాకు సినీ జనాలను ఇంప్రెస్ చేస్తూ విజయవంతంగా ప్రదర్శించబడుతోందట.

అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ (Bollywood) భారీ మల్టీస్టారర్ బ్రహ్మాస్త్ర (Brahmastra). సెప్టెంబర్ 9 ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తోపాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది. రణ్ బీర్ కపూర్‌, అలియాభట్ హీరోహీరోయిన్లుగా..స్టార్ హీరోలు షారుక్ ఖాన్‌, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్ కీలక పాత్రల్లో వచ్చిన ఈ సినిమాకు సినీ జనాలను ఇంప్రెస్ చేస్తూ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.


సెప్టెంబర్ 23న నేషనల్ సినిమా డే సందర్భంగా మేకర్స్ రూ.75కే టికెట్ ధరను నిర్ణయించారట.. ఈ డెసిషన్‌తో సినిమాకు ప్రేక్షకుల రద్దీ మరింత పెరిగినట్టు ట్రేడ్ సర్కిల్ టాక్‌. కాగా మేకర్స్ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు. ఇంతకీ విషయమేంటంటే..సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు టికెట్ ధరను రూ.100కే ఫిక్స్ చేశారు ట.


బ్రహ్మాస్త్రను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసే ఈ ప్రయత్నంతో.. సినిమా లాంగ్ రన్‌లో బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు రాబట్టడటం ఖాయమంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. బ్రహ్మాస్త్ర హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళ భాషల్లో తెరకెక్కి బ్రహ్మాస్త్ర చిత్రం మూడు పార్టులుగా రానుందట.


ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్‌, రణ్ బీర్ కపూర్‌, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా సంయుక్తంగా తెరకెక్కించారు. త్వరలోనే బ్రహ్మాస్త్ర: పార్టు 2 : దేవ్ షూటింగ్ అప్‌డేట్ కూడా రానుందని బీటౌన్ సర్కిల్ టాక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: