ఆమని చివరి కోరిక నెరవేరేనా....!!

murali krishna
తెలుగు సినీ ఇండస్ట్రీ లో హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. శుభలగ్నం, మిస్టర్ పెళ్ళాం ,సిసింద్రీ , ఆ నలుగురు తదితర సినిమాల లో నటించి ఫ్యామిలీ హీరోయిన్ గా పేరు పొందింది.
ఈ ముద్దు గుమ్మ ప్రముఖ డైరెక్టర్లు అయిన కే విశ్వనాథ్, బాపు వంటి వారి దగ్గర మంచి అభిప్రాయాన్ని సంపాదించుకుంది. అయితే ఆమని కి వివాహమైన తర్వాత సినిమాల కు కాస్త దూరంగా ఉన్నది. గడచిన కొంతకాలం నుంచి ఈమె తాజా గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి పలు సినిమాలలోను నటిస్తూనే బుల్లితెరపై కూడా సందడి చేస్తూ ఉన్నది.
అయితే తాజా  గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొ  న్నా ఆమని పలు ఆసక్తికరమైన విషయాల ను తెలియజేసింది. తన కెరియర్ లోని తనకు ఎన్నో విభిన్న మైన క్యారెక్టర్లు వచ్చాయని.. అలాంటి వాటిలో నటిస్తూ వచ్చానని కానీ తనకి పూర్తిగా నటిగా పెద్దగా సంతృప్తి చెందలేదని తెలియజేస్తోంది. తన సంతృప్తి పడేటు వంటి పాత్రల కోసం ఇంకా ఎదురు చూస్తున్నానని.. తెలియ జేసింది ఆమని. తన చివరి కోరిక ఏదైనా ఉంది అంటే అది కేవలం డైరెక్టర్ రాజమౌళి సినిమా లో ఒక క్యారెక్టర్ అయినా చేయాలి అని తెలియ జేసింది. రాజమౌళి డైరెక్షన్లో ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా చేయడాని కి నేను ఎప్పటికీ సిద్ధమే అని తెలియ జేసింది ఆమని.
ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ల సైతం రియంట్రీ ఇచ్చి పలు సినిమాలలో పలు క్యారెక్టర్లలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇటీవల కాలం లో అలాంటి వారిలో మీన విజయశాంతి ,రమ్యకృష్ణ తదితర హీరోయిన్లు ఉన్నారని చెప్పవచ్చు. వీరందరూ పలు సినిమాల లో తల్లిగా లేదా అక్కగా ఇతర పాత్రలో సైతం నటిస్తూ మెప్పిస్తూ ఉన్నారు. అయితే తన చివరి కోరిక మాత్రం మరి ఎప్పటికీ నెరవేర్చు కుంటుందో చూడాలి అని అభిమానులు చాలా ఆత్రుతగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: