ప్రభాస్, మారుతీ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలుసా...?

murali krishna
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అయినా కూడా ఈయన కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతూనే ఉన్నారు. ఈ క్రంమలోనే ప్రభాస్ ఇటీవలే మరో సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే..


ప్రెజెంట్ ప్రభాస్ సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే సినిమాలు చేస్తున్నాడు. ఇందులో ఆదిపురుష్ సినిమా షూట్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సలార్ తో పాటు ప్రాజెక్ట్ కే షూటింగులతో బిజీ బిజీగా ఉన్నాడు.


ఈ రెండు చేస్తూనే మరో సినిమాను లైన్లో పెట్టాడు ప్రభాస్.. ప్రభాస్ మారుతి దర్శకత్వంలో సినిమా ప్రకటించాడు.. ప్రస్తుతానికి 'రాజా డీలక్స్' అనే టైటిల్ నే వర్కింగ్ టైటిల్ ను పెట్టాడు.. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కు జోఢీగా మాస్టర్ బ్యూటీ మాళవిక మోహనన్ ను ఫిక్స్ చేశారని తెలుస్తుంది... అయితే ఇటీవలే ప్రభాస్ పెద్ద నాన్న కృష్ణం రాజు గారు మరణంతో ఈయన షూటింగులకు బ్రేక్ ఇచ్చాడు.. దీంతో అన్ని సినిమాల షూట్ ఆగిపోయిందట.


ఈ మధ్యనే మళ్ళీ సలార్ షూట్ లో ప్రభాస్ పాల్గొన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇక ప్రభాస్ సెట్ లో అడుగు పెట్టడమే ఆలస్యం అనేలా మారుతి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు.. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ ఒక భారీ బంగ్లా సెట్ కూడా వేయించినట్టు సమాచారం.. నవంబర్ నుండి షూట్ స్టార్ట్ చేయబోతున్నారు అని టాక్ వచ్చింది.


కానీ నవంబర్ నుండి ఆదిపురుష్ హడావిడి ఉంటుంది.. ఈ సినిమా జనవరిలోనే రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ముందు నుండే చేస్తారు.. దీంతో మారుతికి టెన్షన్ స్టార్ట్ అయ్యిందని తెలుస్తుంది... నవంబర్ లో స్టార్ట్ చేయలేక పోతే ఇక ఆదిపురుష్ రిలీజ్ తర్వాత ఫిబ్రవరిలోనే ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.. మరి ముందే స్టార్ట్ చేసి ప్రభాస్ సీన్స్ పూర్తి చేస్తారా.. లేదంటే వచ్చే ఏడాదినే స్టార్ట్ అవుతుందా అనేది తెలియాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: