ఫ్లాప్ గా మిగిలిన కెప్టెన్ చిత్రం.. నితిన్ కు ఎంత లాస్ అంటే..?

Divya
కోలీవుడ్లో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ఉంటాడు హీరో ఆర్య. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట అల్లు అర్జున్ నటించిన వరుడు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు అయ్యాడు ఆ తరువాత నేనే అంబాని ,ఆట ఆరంభం ,రాజారాణి తదితర సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. తాజాగా ఆర్య నటించిన చిత్రం కెప్టెన్ ఈ సినిమా సెప్టెంబర్ 8న విడుదలై నెగటివ్ టాకును తెచ్చుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రేష్ఠ మూవీస్ ద్వారా నిర్మాత ఆయన నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేశారు.

ఈ మధ్య సుధాకర్ రెడ్డి విడుదల చేసిన తమిళ చిత్రం విక్రమ్ కూడా ఎంత ఘన విజయాన్ని అందుకుంది దీంతో కెప్టెన్ సినిమా పైన కూడా బయర్లు భారీ నమ్మకాన్ని పెట్టుకున్నారు కానీ మొదటి రోజు టాక్ విభిన్నంగా ఉండడంతో కలెక్షన్లు కూడా ఆశించిన స్థాయిలో రాబట్టుకోలేకపోయాయి. అయితే రెండవ రోజు మాత్రం మరింత దారుణంగా పడిపోయాయి ఈ కలెక్షన్స్. ప్రస్తుతం ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్లను తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు తెలుసుకుందాం.
1). నైజం -31 లక్షలు.
2). సి డెడ్-17 లక్షలు
3). ఉత్తరాంధ్ర-15 లక్షలు.
4). ఈస్ట్-7 లక్షలు.
5). వేస్ట్-5 లక్షలు.
6). గుంటూరు-8 లక్షలు.
7). కృష్ణ-11 లక్షలు.
8). నెల్లూరు-6 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే దాదాపుగా కోటి రూపాయల వరకు కలెక్షన్ చేసిందని చెప్పవచ్చు.

కెప్టెన్ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.1.61 కోట్ల రూపాయలు బిజినెస్ జరగగా.. పలు ఏరియాలలో సుధాకర్ రెడ్డి డైరెక్ట్ గానే విడుదల చేశారు. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే కచ్చితంగా రూ.1.8 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉన్నది. కానీ ఈ చిత్రం విశేషాలు కేవలం కోటి రూపాయలు మాత్రమే రాబట్టింది. దీంతో బయ్యారులకు దాదాపుగా రూ. 80 లక్షల రూపాయల వరకు నష్టం వచ్చిందని చెప్పవచ్చు. దీంతో తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా కూడా ఫ్లాప్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: