మహేష్ కోసం హాలీవుడ్ నటుడిని దింపుతున్న రాజమౌళి..?

Anilkumar
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన తీసే సినిమాలు మాములుగా ఉండవు.ఇక ఇటీవల స్టార్ హీరోలైన ఎన్టీఆర్,మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్.ఆర్.ఆర్ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలావుంటే ఇక జక్కన్న రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కబోతుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలావుంటే ఇక టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

అయితే తాజాగా ఈ  సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది.ఇక ఈ సినిమా కోసం రాజమౌళి ఓ ప్రముఖ హాలీవుడ్ నటుడిని రంగంలోకి దించబోతున్నట్లు వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.అయితే ఎవెంజర్స్, స్టార్ వార్స్, ఎక్స్ఎక్స్ఎక్స్, జురాసిక్ పార్క్, స్పైడర్ మ్యాన్, కెప్టెన్ అమెరికా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన హాలీవుడ్ యాక్టర్ శామ్యూల్ ఎల్ జాక్స్ను  తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే  ఇక ఈ నటుడు ప్రతి సినిమాకు రూ.80 కోట్లు నుంచి 160 కోట్లు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తాడు.

 ఇక రాజమౌళి సినిమాలో ఇతడు ఉన్నాడో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.ఇక ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథ' అంటూ ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చేశారు రాజమౌళి. అయితే ఈ చిత్రం యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కబోతుంది.ఇక  ఈ మూవీని కె.ఎల్‌.నారాయణ నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో మహేశ్ జోడిగా శ్రద్ధ కపూర్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక దీనికి సంబంధించి చిత్రబృందం ఎటువంటి ప్రకటన చేయలేదు.అయితే  ఇప్పటికే ఆర్ఆర్ఆర్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన జక్కన్న.. మరి మహేశ్ తో ఎలాంటి అద్భుతం చేస్తాడో వేచి చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: