సమంత నటనకి షాకైన దిల్ రాజు..!

shami
సౌత్ స్టార్ హీరోయిన్స్ లో సమంత క్రేజ్ ఏంటన్నది అందరికి తెలిసిందే. తన మొదటి సినిమా ఏ మాయ చేసావె సినిమా నుంచి సమంత నటన విషయంలో ది బెస్ట్ అనిపించుకుంటూ వచ్చింది. నేటితరం అభినయ తారగా కెరియర్ లో ఎన్నో ఎత్తు పల్లలు చూసుకుంటూ వచ్చిన సమంత ఆఫ్టర్ డైవర్స్ మళ్లీ ఫ్రెష్ గా తన కెరియర్ మొదలు పెట్టింది. తన దగ్గర ప్రతిభ ఉంది కాబట్టి వరుస అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తుంది.
ఈ సినిమాలో ఆమె టైటిల్ రోల్ చేస్తుంది. నీలిమ గుణ నిర్మిస్తున్న శాకుంతలం సినిమాకు నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా ఉన్నారు. అయితే ఇటీవలే సినిమా ఫస్ట్ కాపీ చూశారట దిల్ రాజు. సినిమా చూసిన ఆయన సమంత నట చూసి షాక్ అయ్యారట. శకుంతల పాత్రలో సమంత ట్రాన్ ఫర్ మేషన్ చూసి దిల్ రాజు ఫిదా అయ్యారట. సినిమా అనుకున్న దానికన్నా బాగా రావడంతో సినిమాని భారీగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.
నవంబర్ 4న శాకుంతలం సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది. వరల్డ్ వైడ్ గా దిల్ రాజు హక్కులు కొనేయగా ఆయన నుంచి మిగతా వారు కొనేస్తారని తెలుస్తుంది. ఏది ఏమైనా సరే శాకుంతలం సినిమాలో సమంత నటన చూసిన దిల్ రాజు ఆమె అద్భుతమైన నటన కి ముగ్ధుడైనాడని తెలుస్తుంది. గుణశేఖర్ కూడా అనుకున్నది అనుకున్నట్టుగా తీశారని చెప్పారట. దిల్ రాజుకి నచ్చింది అంటే సినిమా పక్కా ఓ రేంజ్ లో ఉన్నట్టే లెక్క. సమంత ఈ సినిమాతో పాటుగా హరి హరీష్ డైరక్షన్ లో యశోద అనే థ్రిల్లర్ మూవీ కూడా చేసింది. ఈమధ్యనే రిలీజైన యశోద సినిమా టీజర్ కూడా ప్రేక్షకులని మెప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: