కూతురి భవిష్యత్తు కోసం సంచలన నిర్ణయం తీసుకున్న.... స్టార్...!!

murali krishna
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకుగా ఒకప్పటి కమెడియన్ స్వర్గీయ అల్లు రామలింగయ్య మనవడిగా సినీ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో పేరు సంపాదించుకున్నాడు .
అంతేకాదు గంగోత్రి అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంటర్ అయిన అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ ఒక్కో సినిమాకి 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండస్ట్రీలో సంచలనంగా మారారు. ప్రజెంట్ బన్నీ పుష్ప 2 సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
కాగా, సినిమా షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన టైం పిల్లలతో గడపడానికి ఇష్టపడతారు. అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీరికి అల్లు అయాన్, అల్లు అర్హ ..ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా అల్లు అర్హ ,అల్లు అయ్యాన్ కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్, చిలిపి అల్లర్లు ,సరదా ఆటలు ఎప్పటికప్పుడు స్నేహ రెడ్డి -అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తూ ఉంటారు.
అయితే రీసెంట్ గా అల్లు అర్జున్ తన పిల్లల కెరియర్ కోసం సంచల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోస్ తమ కూతురు కొడుకు భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే సినీ ఇండస్ట్రీలో కి రంగ ప్రవేశం చేస్తూ తమ బెర్త్ లను కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే అల్లు అర్హ కూడా శాకుంతలం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేసింది. అయితే అల్లు అర్జున్ ఇకపై తన కొడుకు కూతురుని సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంచాలని చూస్తున్నారట. వాళ్ల చదువులు అయిపోయిన తర్వాత సినీ ఇండస్ట్రీలోకి వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడట.
అంతే తప్పిస్తే చైల్డ్ యాక్టర్స్ గా వారిని ఇకపై సినిమా ఇండస్ట్రీలో నటింప చేయదలచుకోవట్లేదని సమాచారం. ఫస్ట్ చదువు ఆ తర్వాతే సినిమాలు అంటూ అల్లు అర్జున్ ..పిల్లల్ని ఇండస్ట్రీకి దూరంగా ఉంచబోతున్నట్లు సమాచారం . దీంతో బన్నీ అభిమానులు ఆయనకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. హీరో ఇలానే చేస్తాడు ఒక తండ్రిగా నీ బాధ్యతలను చక్కగా ఫుల్ ఫిల్ చేస్తున్నావ్ హ్యాట్సాఫ్ బన్నీ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: