కాజల్ కొత్త వ్యాపారం.. మాములుగా లేదుగా?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత మళ్లీ సినిమాలు చేస్తారా చేయరా అనే అనుమానం అందరిలోనూ ఉంది. అయితే ఒప్పుకున్న సినిమాలు మాత్రం పూర్తి చేయాలని ఫిక్సయ్యారు ఈ చందమామ గారు.ఆ తర్వాత ఫ్యూచర్ ప్లాన్ మాత్రం చెప్పట్లేదు. కానీ సినిమాలను మించిన ప్లానింగ్ మాత్రం చేసుకుంటున్నారు. సమంత స్నేహితురాలితో కలిసి ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసారు. మరి ఈ సమయంలో కాజల్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారా లేదంటే గత జ్ఞాపకంగా మిగిలిపోనున్నారా..? ఎందుకంటే ఒకటి రెండు కాదు.. 15 ఏళ్లుగా టాలీవుడ్‌తో విడదీయరాని అనుబంధం ఉంది కాజల్‌కు. ఏదో రెండేళ్లు గ్యాప్ వచ్చినంత మాత్రానా.. చందమామను అభిమానులు మరిచిపోవాలంటే కష్టమే. 2020లో గౌతమ్ కిచ్లును పెళ్లాడిన తర్వాత.. కొత్త సినిమాలకి సైన్ చేయడమే మానేసారు కాజల్. పైగా ఈ మధ్యే బిడ్డకు తల్లైన కాజల్.. సినిమాల గురించి ఆలోచించట్లేదు. కొడుకే ప్రపంచంగా ఉన్న ఈమె.. ఇప్పుడిప్పుడే బయటికొస్తున్నారు.


ఇక తన కొడుకు నెయిల్ కిచ్లుకు 5 నెలలు రావడంతో.. తన ఫోకస్ వేరే వాటివైపు షిఫ్ట్ చేస్తున్నారు కాజల్. అప్పట్లో సైన్ చేసిన భారతీయుడు 2 సినిమాని పూర్తి చేయనున్నారు చందమామ. ఇప్పటికే ఆ సినిమా సెట్స్‌లోకి అడుగు పెట్టారు ఈ బ్యూటీ. ఇది అయిపోయాక.. కాజల్ ఆలోచనలు పూర్తిగా బిజినెస్ వైపు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చెల్లి నిషా అగర్వాల్‌తో కలిసి జ్యూవెలరీతో పాటు ఫుట్ వేర్ బిజినెస్ చేస్తున్నారు కాజల్. తాజాగా మరో బిజినెస్ మొదలుపెట్టారు కాజల్. సమంత స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి కేర్ అండ్ కేరాస్ అంటూ బేబీ ప్రాడక్ట్స్‌ షురూ చేసారు చందమామ. చిన్న పిల్లలకు కావాల్సిన ఫుడ్, అప్పుడే పుట్టిన బేబీస్‌కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సహా ఇంకా ఎన్నో విషయాలను తన రీసర్చ్ టీమ్‌తో కలిసి కూర్చుని ఈ బిజినెస్ స్టార్ట్ చేసారు కాజల్. మొత్తానికి ఈమె తీరు చూస్తుంటే.. మునపటి కాజల్‌ను చూడటం కష్టమే అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: