మీసలోడు గా పేరూపొందిన ఆ స్టార్ హీరో ఎవరు....!!

murali krishna
టాలీవుడ్ ప్రొడక్షన్స్ కంపెనీస్ లో యూవీ క్రియేషన్స్ ఒకటి.. పాన్ ఇండియా సినిమాలకు పెట్టింది పేరుగా వరుస సినిమాలను నిర్మిస్తూ యూవీ మంచి పేరును సంపాదించుకొంది.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, తారక్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలను నిర్మిస్తున్న యూవీ తాజాగా మీసాలోడు అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించింది. అయితే ఈ టైటిల్ ఎవరికి అనేది తెలియాల్సి ఉంది. ఈ టైటిల్ లీక్ అవ్వడంతో హీరో ఫ్యాన్స్ తమ హీరో కంటే తమ హీరోకే అని చర్చ మొదలుపెట్టాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ తో యూవీ ఒక సినిమా చేయబోతోంది. జెర్సీ లాంటి క్లాసిక్ సినిమాను అందించిన గౌతమ్.. చరణ్ తో ఒక మాస్ ఎంటర్ టైనర్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఇక ఈ టైటిల్ కూడా చరణ్ కు బాగా సూటవుతుంది.. చరణ్ కోసం ఈ టైటిల్ ను అనుకుంటున్నారని చెప్పుకొస్తున్నారు.
ఎన్టీఆర్ సైతం యూవీలో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపి స్తున్నాయి. ఎన్టీఆర్ కి కూడా ఈ టైటిల్ సెట్ అవుతుందనే చెప్పొచ్చు. ఇక ఈ ఇద్దరు కాకుండా ప్రభాస్ డేట్స్ ఎప్పుడు యూవీ చేతిలోనే ఉంటాయి. ప్రభాస్ కు కూడా మీసాలోడు సూట్ అవుతుందనే చెప్పొచ్చు. మరి ఈ ముగ్గురు హీరోల్లో ఆ టైటిల్ ను తన్నుకుపోయేది ఇక ఎవరో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ ముగ్గురు కాకుండా నవీన్ పోలిశెట్టి ఏమైనా ఈ టైటిల్ పై మనసుపడ్డాడా..? అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. యూవీ క్రియేషన్స్ లో నవీన్, అనుష్క జంటగా ఒక సినిమా వస్తున్న విషయం విదితమే.. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అని అనుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కాకుండా మీసాలోడు ఏమైనా సెట్ చేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: