నాగశౌర్య పాదయాత్ర ఫలించింది... సినిమా హిట్ !

VAMSI
ఒక సినిమా మన ముందుకు 70 ఎం ఎం తెరమీదకు రావాలంటే దాని వెనుక లక్షల మంది శ్రమ మరియు కోట్ల డబ్బు ఉంటుంది. అయితే సినిమాలు తీసి థియేటర్ లలో రిలీజ్ చేయగానే అవి హిట్ అయిపోయి నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించవు. ఆ సినిమా బాగుంటేనే ప్రేక్షకులు ఎంతో హ్యాపీగా థియేటర్ కు వస్తారు. కొంచెం కథ బాలేకపోయినా సినిమాకు వసూళ్లు రావడం చాలా కష్టం. అలా ఏంటో కష్టపడి తీసిన సినిమా హిట్ అందుకోవాలని చిత్ర బృందం ఎన్నో ప్రమోషన్ కార్యక్రమాలను చేసి ప్రేక్షకుల లోకి సినిమాను తీసుకెళ్తారు. అయితే దీనికి ఎన్నో మార్గాలు ఉంటాయి.. కొందరు చిన్న చిన్న ఇంటర్వ్యూ లను ఏర్పాటు చేస్తారు... చిట్ చాట్ లు ఏకంగా డైరెక్టర్, హీరోలతో ప్లాన్ చేస్తారు.
అయితే ఈసారి ఒక హీరో మాత్రం ఇంకొంచెం కొత్తగా ఆలోచించి పాదయాత్ర చేసి సినిమాను ప్రమోట్ చేశాడు. యంగ్ హీరో నాగశౌర్య హీరోగా నటించిన కృష్ణ వృందా విహారి సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం నాగశౌర్య తిరుపతి నుండి వైజాగ్ వరకు పాదయాత్ర చేసి మరీ సినిమాను ప్రమోట్ చేశాడు. ఆయన పాదయాత్ర ఫలించిందో ఏమో తెలియదు.. కానీ సినిమా గురించి పాజిటివ్ టాక్ వినబడుతోంది. ఇందులో నాగశౌర్య మరియు షిర్లే సెటియా లు హీరో హీరోయిన్ లుగా నటించగా,  రాధికా శరత్‌కుమార్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలలో నటించి మెప్పించారు. కాగా "అలా ఎలా" సినిమాతో మెప్పించిన దర్శకుడు అనీష్ కృష్ణ ఈ సినిమాను తెరకెక్కించాడు.
ఈ సినిమా ఫ్యామిలీ కామెడీ అండ్ సెంటిమెంటల్ డ్రామాగా చెప్పుకోవచ్చు. నాగశౌర్య మరియు షిర్లే లు తమ తమ పాత్రలలో చక్కగా ఒదిగిపోయారు. డైలాగు డెలివరీ లో కొత్తగా మరియు సరికొత్త కామెడీ టైమింగ్ తో డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు నాగశౌర్య. ముఖ్యంగా మెయిన్ లీడ్స్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది. షిర్లే కు టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. మొత్తానికి నాగశౌర్య చలో తర్వాత... అంతటి హిట్ ను అందుకుని తన ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తాడు. ఒకరంగా చెప్పాలంటే ఈ వారం విడుదలైన సినిమాలలో దీనికే అందరూ ఓటేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: