షారుక్ 'జవాన్' మూవీలో దళపతి విజయ్..?

Pulgam Srinivas
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా కోలీవుడ్ క్రేజీ దర్శకుడు అట్లీ దర్శకత్వం లో జవాన్ అనే ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నయన తార ,  ప్రియ మణి ముఖ్య పాత్రలో కనిపించ బోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ని మూవీ యూనిట్ విడుదల చేయగా దీనికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ప్రేక్షకులను ఆకట్టు కునే విధంగా ఉండడంతో ప్రేక్షకులకు ఈ మూవీ పై క్రేజ్ మరింతగా పెరిగి పోయింది.

ఇది ఇలా ఉంటే తాజాగా జవాన్ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది  అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్న అట్లీ తాజాగా ఒక ఫోటో ను షేర్ చేశాడు. ఈ ఫోటో లో అట్లీ తో పాటు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మరియు దళపతి విజయ్ లు కూడా ఉన్నారు. దీనితో అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న జవాన్ మూవీ లో దళపతి విజయ్ ఒక కీలకమైన పాత్రలో నటించ బోతున్నాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు వెలబడలేదు. ఇది ఇలా ఉంటే గతంలో దళపతి విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో పోలీసోడు ,  అదిరింది ,  విజిల్ అనే మూడు మూవీ లు తెరకెక్కాయి. ఈ మూడు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: