మృనాల్ ఠాకూర్ పై ప్రశంశల వర్షం కురిపించిన కంగనా రనౌత్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతా రామం అనే తెలుగు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను కూడా ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది.

అలాగే ఈ మూవీ లోని మృణాల్ ఠాగూర్ నటనకు గాను ఇటు ప్రేక్షకుల  నుండి , అటు విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. అలాగే ఈ మూవీ మృణాల్ ఠాకూర్ కు అదిరిపోయే రేంజ్ గుర్తింపును కూడా తీసుకువచ్చింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ మూవీ హిందీ లో కూడా విడుదల అయ్యింది.  ఈ మూవీ హిందీ ప్రేక్షకులను కూడా అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ సీతా రామం మూవీ లోని మృణాల్ ఠాకూర్ నటన పై ప్రశంసల వర్షం కురిపించింది.  

కంగనా రనౌత్ తాజాగా సీతా రామం మూవీ లోని మృణాల్ ఠాకూర్ నటన గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ... సీతా రామం మూవీ లో అందరూ చాలా బాగా నటించారని , అయితే అందులో మృణాల్ ఠాకూర్  నటన తనకు అద్భుతం అనిపించిందని కంగనా రనౌత్ పేర్కొంది. మృణాల్ ఠాకూర్ భావోద్వేగ పూరిత సన్నివేశాల్లో బాగా నటించిందని, అలా మరెవరూ నటించలేరని కంగనా రనౌత్ ప్రశంసించింది. మృణాల్ ఠాకూర్ నిజంగానే ఓ రాణి. జిందాబాద్‌ ఠాకూర్‌ సాబ్. ఇక ముందు ముందు కాలం మీదే’ అంటూ ఇన్ స్టా పోస్ట్ కంగనా రనౌత్ త్ పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: