ధనుష్ 'నేనే వస్తున్నా' మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన ధనుష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ధనుష్ ఇప్పటికే ఈ సంవత్సరం తిరు మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం తిరు మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ధనుష్ తాజాగా నేనే వస్తున్నా అనే మూవీ లో హీరోగా నటించాడు.

ఈ మూవీ ని సెప్టెంబర్ 29 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించగా ,  యువన్ శంకర్ రాజా ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ని తెలుగులో గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే చాలా కాలం గ్యాప్ తర్వాత ధనుష్ మరియు సెల్వ రాఘవన్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ కావడంతో ఈ  మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. మూవీ యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇది ఎలా ఉంటే ఇప్పటికే తిరు మూవీ తో ఈ సంవత్సరం మంచి విజయాన్ని  సొంతం చేసుకున్న ధనుష్ 'నేనే వస్తున్నా' మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: