టాలీవుడ్ మార్కెట్ కోసం పోటీ పడుతున్న కోలీవుడ్ హీరోలు?

Purushottham Vinay
తమిళ హీరోలు ప్రస్తుతం తెలుగులో తమ మార్కెట్ ని విస్తరించుకునే పనిలో వున్నారు. ఇక ఈ ఏడాది జెట్‌ స్పీడ్‌ మీదుంది ధనుష్‌ కెరీర్‌. హాలీవుడ్‌ మూవీ ది గ్రే మేన్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా రిలీజైన తిరు చిత్రంబలం కి ఆల్‌ ఓవర్‌ హిట్‌ టాక్‌ వచ్చింది. నానే వరువేన్‌ మీద గట్టి హోప్స్ ఉన్నాయి. వాటన్నిటితో పాటు తెలుగు, తమిళ్‌లో ఆయన నటిస్తున్న సర్‌ కచ్చితంగా హిట్‌ అయి తీరుతుందనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది ఫిల్మీ సర్కిల్స్ లో. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్‌ఫోర్‌ స్‌, శ్రీకర స్టూడియోస్‌ నిర్మిస్తున్నాయి. ఇంతకు ముందు పలు అనువాద చిత్రాలతో తెలుగువారిని పలకరించారు ధనుష్‌. ఆయన కెరీర్‌లో ఫస్ట్ తెలుగు ఇదే.ఇంకా అలాగే ఈమధ్య కాలంలో బ్యాక్‌ టు బ్యాక్‌ తన లతో వంద కోట్లు కలెక్ట్ చేస్తున్న మరో తమిళ హీరో శివ కార్తికేయన్‌. లాస్ట్ ఇయర్‌ డాక్టర్‌ మూవీతో సైలెంట్‌గా హండ్రడ్‌ క్రోర్స్ మార్క్ ని టచ్‌ చేశారు శివ. ఈ ఏడాది డాన్‌తో దాన్ని కంటిన్యూ చేశారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ప్రిన్స్. అనుదీప్‌ కె.వి. దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్‌ ఎల్‌ఎల్‌పీ, సురేష్‌ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్‌ కలిసి నిర్మిస్తున్నాయి.


ఈ దీపావళికి విడుదల కానుంది ప్రిన్స్. ఇంతకు ముందు కౌసల్యా కృష్ణమూర్తిలో నటించిన శివకార్తికేయన్‌కి, ప్రిన్స్… హీరోగా ఫుల్‌ప్లెడ్జ్ డ్‌ తెలుగు సినిమా. అలాగే ఇప్పుడు సెట్స్ మీదున్న ల్లో విజయ్‌ వారిసుకి స్పెషల్‌ క్రేజ్‌ ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి డేట్‌ని టార్గెట్‌ చేసింది. విజయ్‌ని ఫేస్‌ చేసిన ప్రతిసారీ ఫ్యాన్‌ గర్ల్ మొమెంట్‌ని ఎంజాయ్‌ చేస్తూనే ఉన్నారు హీరోయిన్‌ రష్మిక మందన్న. ఈ ఏడాది బీస్ట్ విజయ్‌కి ఆశించిన ఫలితం తీసుకురాలేదు. వారిసు ఆ కొరత తీరుస్తుందంటున్నారు దళపతి ఫ్యాన్స్.ఇక ఈ ముగ్గురు కూడా స్ట్రెయిట్ గా తెలుగు సినిమాలు చేసి తెలుగులో మంచి మార్కెట్ పొందాలనుకుంటున్నారు. మరి చూడాలి రజినీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, సూర్య, విశాల్, కార్తీ లాగా వీరు ముగ్గురు కూడా ఇక్కడ మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటారో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: