'ఓటిటి' ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ధనుష్ 'తిరు' మూవీ..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన ధనుష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ధనుష్ ఇప్పటికే తాను నటించిన ఇతర భాష మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి ఇక్కడ కూడా మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ ప్రేమికుల మనసు కూడా దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ధనుష్ తమిళ్ లో తిరు చిత్రాంబళం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ ని తెలుగు లో తిరు అనే పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ ని తెలుగు లో 18 ఆగస్టు 2022 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించింది.  ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిన ఈ మూవీ తాజాగా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఈ రోజు నుండి అనగా సెప్టెంబర్ 23 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి సన్ నెక్స్ట్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో  స్ట్రీమింగ్ అవుతుంది.  

ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే సన్ నెక్స్ట్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో ఈ రోజు నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. నిత్యామీనన్‌, ప్రియా భవానీ శంకర్‌, రాశీఖన్నా, ప్రకాశ్‌ రాజ్‌, భారతీ రాజా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా , మిత్రన్‌ ఆర్‌. జవహర్‌ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించగా ,  సన్ పిక్చర్ సంస్థ ఈ మూవీ ని నిర్మించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: